RBI New Rules: మీ ఈఎంఐ చెల్లింపుల్లో కొత్త మార్పులు, ఇవాళ్టి నుంచి ఇలా చేయాల్సిందే
అక్టోబర్ 1, 2021 నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు అమలవుతుంది. చెల్లింపులకు 24 గంటల ముందు బ్యాంకులు కస్టమర్లను అలర్ట్ చేయాలి. అలర్ట్ మెస్సేజ్ లేదా ఈ మెయిల్ రూపంలో ఉండవచ్చు.
ఇక నుంచి హోంలోన్స్ ఈఎంఐ, ఇతర చెల్లింపులకు మ్యాన్యువల్‌గా అప్రూవ్ చేయాల్సిందే. ఈ తరహా చెల్లింపులకు యూజర్ల నుంచి ఏ విధమైన అదనపు ఛార్జీల్ని వసూలు చేయరని ఆర్బీఐ స్పష్టం చేసింది. నిబంధనలు పాటించని బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు ఆర్బీఐ చెబుతోంది. వివిధ బ్యాంకులు ఇప్పటికే వినియోగదారులకు అలర్ట్ మెస్సేజ్‌లు, మెయిల్స్ పంపించాయి.
ఓటీపీ ధృవీకరణ ద్వారానే చెల్లింపు జరుగుతుంది. వ్యక్తిగత చెల్లింపుల్లో భద్రత కోసమే కొత్త విధానం ప్రవేశపెట్టినట్టు ఆర్బీఐ చెబుతోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్ , ఫోన్ రీఛార్జ్ , బిల్ పేమెంట్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం, యుటిలిటీ బిల్స్ అన్నీ కొత్త నిబంధనల పరిధిలో రానున్నాయి. ఐదు వేలలోపు పేమెంట్స్‌కు మాత్రం కొత్త నిబంధనలు వర్తించవు.
ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం చెల్లింపుదారుడి ధృవీకరణ లేకుండా 5 వేలకు మించిన చెల్లింపులు జరగవు. కచ్చితంగా ఓటీపీ ద్వారా ధృవీకరించాల్సిందే. ఆర్బీఐ చెల్లింపుదారుల్ని అప్రమత్తం చేస్తోంది. ఆటోమేటిక్ డెబిట్ చెల్లింపులకు ఇక నుంచి అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటిఫికేషన్ అంటే ఏఎఫ్ఏ అవసరం.
5 వేల కంటే ఎక్కువ చెల్లింపులకు యూజర్ నుంచి ఓటీపీ తప్పనిసరి. అన్నిరకాల క్రెడిట్, డెబిట్ కార్డులకు దేశీయ, అంతర్జాతీయ లావాదేవీలకు కొత్త నిబంధనల వర్తింపుమ్యూచువల్ ఫండ్ సిప్స్ వంటి చెల్లింపులకు వర్తించదు.