RBI Recruitment 2024: ఆర్‌బీఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. గ్రేడ్ B పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ
RBI Recruitment 2024: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాళీల భర్తీకి దరఖాస్తులు చేపట్టింది. ఈ పోస్టులకు అప్లై చేసుకునేవారు కలిగి ఉండాల్సిన అర్హత, ఇతర వివరాలు తెలుసుకుందాం.
ప్రభుత్వ ఉద్యోగం పొందాలని ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ బీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో జనరల్, DEPR, DSIM స్ట్రీమ్‌ల భర్తీ చేయనుంది. జూలై 25 గురువారం నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 94 పోస్టులు భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ rbi.org.in ద్వారా నేరుగా అప్లై చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 16.
ఆర్‌బీఐ గ్రేడ్ బీ ఆఫీసర్ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 850 ఆన్‌లైన్‌లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ జనరల్ పోస్టులకు డిగ్రీ లేదా పీజీలో 60 శాతం మార్కులతో ఉత్తిర్ణత సాధించి ఉండాలి. రిజర్వ కేటగిరీకి 55 శాతం కట్‌ఆఫ్.
గ్రేడ్ బీ ఆఫీసర్ (DEPR) పోస్టుకు ఎకనామిక్స్ లేదా ఫైనాన్స్‌లో పీజీ చేసి ఉండాలి. వీరు కనీసం 55 శాతం మార్కులు పొంది ఉండాలి. గ్రేడ్ బీ ఆఫీసర్ (DSIM) పోస్టుకు మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ లేదా స్టాటిస్టిక్స్‌లో పీజీ పూర్తి చేసి ఉండాలి. వీరు కనీసం 60 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయో పరిమితి 21 ఏళ్లు , 30 ఏళ్లు మించకుండా ఉండాలి. అంటే 1994 జూలై 2 కంటే ముందు పుట్టినవారు అర్హులు కాదు. 2003 జూలై 1 తర్వాత పుట్టినవారు అర్హలు కాదు. అయితే, ఏజ్ రిలాక్సేషన్‌ఉంది. ఈ పోస్టులకు అప్లై చేసుకునేవారు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఉండాలి.