Bank Locker Rules: బ్యాంకులో లాకర్ తీసుకునేవారికి అలర్ట్.. ఆర్బిఐ కొత్త గైడ్‎లెన్స్ ఇవే

Fri, 06 Sep 2024-12:46 pm,

Bank locker Rules 2024: ఇంట్లో విలువైన వస్తువులు, నగలు, డబ్బులను ఉంచుకోలేము. ఎందుకంటే విలువైన వస్తువులు ఉంటే భయంగా ఉంటుంది. అలాంటి వారు బ్యాంకు లాకర్ లో దాచుకుంటారు. ఎందుకంటే బ్యాంక్ లాకర్ అనేది ఏ వస్తువులకైనా సురక్షితంగా ఉంటుంది. బ్యాంకులు కూడా ప్రజల వస్తువులను రక్షించేందుకు భారీ భద్రతను ఉపయోగిస్తాయి. లాకర్ ఉన్న ప్రాంతాన్ని సిసి కెమెరాలతో పర్యవేక్షిస్తుంది. లాకర్ తీసుకున్న వ్యక్తికి మాత్రమే యాక్సెస్ ఇస్తుంది. అయితే లాకర్ కు సంబంధించి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్బిఐ) మార్గదర్శకాలను రూపొందించింది. ఇందులో లాకర్లో ఏవి ఉంచాలి..ఏవి ఉంచకూడదు..ఏదైన వస్తువు దొంగలించబడినా లేదా పోయినా బ్యాంకు ఎలాంటి బాధ్యత వహిస్తుందన్న వివరాలను తెలిపింది. అవేంటో చూద్దాం.   

బ్యాంక్ లాకర్ ఒప్పందాల పునరుద్ధరణ ప్రక్రియ  రిజ్వర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా...బ్యాంక్ లాకర్ రెగ్యులేషన్స్‌లో కూడా పేర్కొంది.  డిసెంబరు 31, 2023న లేదా అంతకు ముందు అగ్రిమెంట్‌లను ఫైల్ చేసిన ఖాతాదారులు సవరించిన ఒప్పందంపై సంతకం చేసి, అదే తేదీలోపు సంబంధిత బ్యాంకుకు సమర్పించాలి. లేదంటే లాకర్ ను బ్యాంక్ క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది.   

బ్యాంకు లాకర్‌ను ఎవరు అర్హులు?  లాకర్ సదుపాయంతో సహా ఇతర సేవలను పొందేందుకు కొన్ని బ్యాంకులు ఖాతాదారులు సేవింగ్స్ లేదా కరెంట్  ఖాతాను తెరవాలి. లాకర్ సౌకర్యం కోసం సైన్ అప్ చేయడానికి, వ్యక్తులు పాన్ లేదా ఆధార్ కార్డ్, ఇటీవలి ఫోటోతో సహా వ్యక్తిగత గుర్తింపు, చిరునామాకు సంబంధించి ఐడెంటిఫికేషన్ తప్పనిసరిగా బ్యాంకుకు సబ్మిట్ చేయాలి.   

లాకర్ ఒప్పందంపై సంతకం : లాకర్‌ను సెటప్ చేయడానికి, లాకర్ సర్వీస్  ఎలా పని చేస్తుందో వివరించే పత్రాన్ని బ్యాంకులు అందిస్తాయి. ఈ ఒప్పందం చట్టబద్ధంగా కట్టుబడి ఉంటుంది.  లాకర్ తీసుకునేవారు. .లాకర్ సదుపాయం కలిపించే వారు  తప్పనిసరిగా సంతకం చేయాలి. ఈ పత్రంలో లాకర్ ను ఎలా ఉపయోగించాలి. ఏం చేయాలి..ఏం చేయకూడదనే విషయాలు స్పష్టంగా ఉంటాయి.   

లాకర్ల కేటాయింపు: లాకర్లలో రెండు రకాలు ఉంటాయి. చిన్నవి..పెద్దవి. డిజైన్ లో సింగిల్ టైర్ లేదా మల్టీ టైర్ ఉంటుంది. లాకర్ తీసుకున్న మొదట్లో చాలా అంశాలు తెలుసుకోవలె. కొన్ని సందర్భాల్లో వెయిటింగ్ లిస్టు విధానం కూడా ఉంటుంది. కస్టమర్ కు లాకర్ కేటాయించిన తర్వాత ఒక ప్రత్యేక కీ నెంబర్ ను బ్యాంకు వారు ఇస్తారు. అంతేకాదు బ్యాంకు కూడా ఒక మాస్టర్ కీని తన వద్ద ఉంచుకుంటుంది.   

చెల్లింపు: చాలా సందర్భాలలో, బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ లేదా నగదు మొత్తం రూపంలో ఉండే సెక్యూరిటీ మొత్తాన్ని డిమాండ్ చేస్తాయి. అదనంగా, లాకర్ అద్దె ధర శాఖ యొక్క స్థానం, అద్దెకు ఇవ్వబడే లాకర్ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link