Ayodhya History: హిందువుల పవిత్ర నగరం ఆయోధ్య చరిత్ర, ఆసక్తికరమైన విషయాలు
1. పురాతన కాలం నుంచి హిందువుల ఏడు పవిత్ర నగరాల్లో అయోధ్య నగరం ( Ancient City Ayodhya ) కూడా ఒకటి. రాముడు జన్మించిన నగరంగా కీర్తించబడే అయోధ్యలో అప్పట్లోనే భారీ సంఖ్యలో జనాభా ( Ayodhya Population ) నివసించేది. ప్రజలు సుఖశాంతులతో, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండేవారు.
2. కోసల రాజ్యానికి ( Kosala Kingdom ) ఆయోధ్య రాజధాని అని చెబుతారు. బుద్ధుడి కాలంలో ( క్రీస్తు పూర్వం 6-5వ శతాబ్దంలో ) ఆయోధ్య నగరానికి శ్రావస్టి ( Shravasti ) పాలకుడిగా ఎంపికయ్యాడు. బుద్ధుడు ఎక్కువ కాలం నివసించిన సాకేత నగరానికి ( Saketa ) ఆయోధ్యకు సారూప్యత ఉంది అని చరిత్రకారులు చెబుతుంటారు.
3. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో కనౌజ్ రాజ్యాధికారంలో ( Kanauj Kingdom ) అయోధ్య నగరం.. అవధ్ గా మారిందని అంటారు. జౌన్ పూర్ రాజ్యంలో ( Jaunpur Kingdom ) భాగంగా ఆయోధ్య నగరంలో ఢిల్లీ సుల్తానుల ( Delhi Sultanate ) పాలనలో ఉండేది. 16వ శతాబ్దంలో ఈ నగరం మొఘలుల పాలనలో చేరింది.
4. 18 వ శతాబ్దంలో ఆయోధ్య నగరం స్వతంత్ర్య నగరంగా అవతరించింది. అదే సమయంలో 1764 లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ( East India Company ) ఆయోధ్యను తమ భూభాగంలో చేర్చుకుంది.
5. హిందువుల పవిత్ర నగరం అయిన ఆయోధ్య నగరాన్ని బ్రిటిష్ వారు అక్రమంగా పాలించడం వల్ల ప్రజల్లో కోపం పెరిగింది.1857లో సిపాయిల తిరుగుబాటు జరగడానికి ప్రేరేపించిన అంశాల్లో ఆయోధ్య నగరంలో బ్రిటిషువాళ్ల పాలన కూడా ఒకటి.
6.1877లో ఆగ్రా రాష్ట్రంలో ( Agra Province) చేరిన ఆయోధ్య..తరువాత నార్త్ వెస్ట్ ప్రావిన్సులో చేరింది. తరువాత యునైటెడ్ ప్రావిన్స్ ఆఫ్ ఆగ్రా అండ్ అవధ్.. అంటే నేటి ఉత్తర్ ప్రదేశ్ లో చేరింది.
7. ఎన్నో శతాబ్దాల చరిత్రగల నగరం అయినప్పటికీ అయోధ్యలో పౌరాణిక కట్టడాలు ఇప్పుడు కొన్ని మాత్రమే మిగిలాయి. మొఘలుల కాలం (16వ శతాబ్దం ) లో రాముడి జన్మస్థలంగా చారిత్రక ఆనవాళ్లు ఉన్న స్థలం.. రామ్ జన్మభూమి ( Ram Janmabhoomi ) లో బాబర్ ఇక్కడ బాబ్రీ మజీదు ( The Babri Masjid ) కట్టించాడు.
8. ఈ స్థలంపై ఇటు హిందువులు, అటు ముస్లిం మతస్థుల ధార్మిక విశిష్టత వల్ల ఇరు వర్గాల్లో విభేధాలు వచ్చాయి.1990 బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత దేశ వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు జరిగాయి. విషయం న్యాయస్థానానికి చేరింది.
10. 2019 నవంబర్ 9న సుప్రీం కోర్టు తన తీర్పును ప్రకటిస్తూ 2.77 ఎకరాలు వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్టుకు అప్పగించాలి అని.. సున్నీ బోర్డుకు ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల స్థలం కేటాయించాలి అని తెలిపింది. ఆలయ నిర్మాణం, నిర్వహణ పనులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
9. ఆయోధ్య స్థల వివాదం ( Ayodhya Contoversy ) గురించి విచారించిన అలహాబాద్ కోర్టు 2010 సెప్టెంబర్ 30న తీర్పు ప్రకటించింది. తరువాత వివాదం సుప్రీకోర్టుకు చేరింది.