Realme Gt Neo 3 Price: దీపావళి సందర్భంగా అత్యంత చౌకగా realme GT Neo 3 మొబైల్‌..ఇలా రూ. 8,899కే పొందండి..

Sun, 12 Nov 2023-5:30 pm,

ఈ రియల్ మీ GT నియో 3 స్మార్ట్ ఫోన్‌ను భారీ తగ్గింపుతో పొందాలనుకునే వారికి ఫ్లిప్‌కార్ట్‌ దీపావళి సందర్భంగా ప్రత్యేక తగ్గింపు అందిస్తోంది. మొదటగా ఈ స్మార్ట్ ఫోన్ MRP ధర రూ.38,999కు విక్రయించేది. అయితే ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా 20 శాతం తగ్గింపుతో లభిస్తోంది.   

రియల్ మీ GT నియో 3 స్మార్ట్ ఫోన్ ను ప్రత్యేక ఆఫర్లలో భాగంగా 20 శాతం తగ్గింపుతో కేవలం రూ.30,999కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా అదనంగా తగ్గింపు పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.  

ఈ GT నియో 3 (realme GT Neo 3) స్మార్ట్ ఫోన్ ను బ్యాంక్ ఆఫర్లలో భాగంగా కొనుగోలు చేయాలనుకునేవారు ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి బిల్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డుతో బిల్ చెల్లిస్తే రూ.1,550 వరకు తగ్గింపు లభిస్తుంది.   

ఈ realme GT Neo 3 స్మార్ట్ ఫోన్ ను మరింత తగ్గింపుతో కొనుగోలు చేయాలనుకునేవారు ఎక్స్చేంజ్ ఆఫర్ను వినియోగించాల్సి ఉంటుంది. మీరు వినియోగిస్తున్న బ్రాండెడ్ పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే దాదాపు రూ. 22,100 వరకు తగ్గింపు లభిస్తుంది. 

ఇక ఈ realme GT Neo 3 స్మార్ట్ ఫోన్ బ్యాంక్ ఆఫర్స్, డిస్కౌంట్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్ పోను రూ. 8,899కే పొందవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీ పాత స్మార్ట్ ఫోన్ కండిషన్‌, బ్రాండ్‌ని బట్టి ఆధారపడి ఉంటుంది మీ స్మార్ట్ ఫోన్ కండిషన్ బాగుంటేనే ఫ్లిప్‌కార్ట్‌ అందించే బోనస్ లభిస్తుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link