Prabhas: ప్రభాస్ ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడం వెనుక రహస్యం ఏమిటంటే..?
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరుపొందారు హీరో ప్రభాస్. సినిమాలలో పాన్ ఇండియా లెవెల్లో హీరోగా సక్సెస్ అయినప్పటికీ వివాహ విషయంలో మాత్రం ఎందుకో వెనుకడుగు వేస్తూ ఉన్నారు. గత కొన్నేళ్లుగా ప్రభాస్ పెళ్లి వచ్చే ఏడాది , వచ్చే యేడాది అంటూ ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు దాటేయడం జరిగింది. అయితే ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడం వెనక ఒక కారణం ఉందనే విషయం ఇప్పుడు వైరల్ గా మారుతున్నది. వాటి గురించి చూద్దాం.
ప్రభాస్ అతి చిన్న వయసులోనే హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ప్రభాస్ రేంజ్ బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీ మారిపోయింది. ఈ చిత్రంతోనే పాన్ ఇండియా స్టార్ హీరోగా మొట్టమొదట పేరు సంపాదించుకున్నారు. ఇక తర్వాత తాను నటించిన అన్ని సినిమాలు కూడా భారీ బడ్జెట్ సినిమాలే కాకుండా విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు.
సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ప్రభాస్, పెళ్లి విషయంలో మాత్రం అభిమానులను ఎప్పుడు డిసప్పాయింట్ చేస్తూ ఉంటారు. ప్రభాస్ వయసు ఇప్పటికే 40 ఏళ్లు కూడా దాటిపోయింది.అయినప్పటికీ కూడా ఇంకా వివాహం విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడంతో అభిమానులు సైతం చాలా నిరాశతో ఉన్నారు. గతంలో ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్స్ అయితే వినిపించాయి. ఈ జంట విషయంలో అటు ఇద్దరు అభిమానులు కూడా కాస్త ఇష్టంగానే కోరుకుంటున్నారు.
వీటికి తోడు అనుష్క కూడా వివాహం చేసుకోకుండా ప్రస్తుతం ఒంటరిగానే ఉన్నది. ఇలాంటి పరిస్థితులలో ప్రభాస్ పెళ్లి ఆలోచన ఎందుకు చేయడం లేదనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ముఖ్యంగా ప్రభాస్ కు పెళ్లి ఇష్టం లేదని, పెళ్లి చేసుకోను అని చెప్పినట్టు.. సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారుతున్నాయి.
ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఒక నటి అని, ఆమెతో ప్రేమాయణం సాగిస్తున్నారని , కానీ జాతకరీత్యా వీరిద్దరి జాతకాలు సరిపోకపోవడం వల్ల వివాహం చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి ఆ నటి ఎవరు? అనే విషయం మాత్రం తెలియలేదు. కానీ మొత్తానికి ప్రభాస్ పెళ్లి విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ ప్రభాస్ పెద్దమ్మ మాత్రం ప్రభాస్ పెళ్లి త్వరలోనే ఉంటుందంటూ తెలియజేస్తూ ఉంటుంది.