Prabhas House: ప్రభాస్ ఇంటిని చూశారా.. ఏకంగా మాహిష్మతిని తలదన్నేలా బాహుబలి ఇల్లు..!
ప్రభాస్ ఇపుడు టాలీవుడ్ హీరో కాదు.. ప్యాన్ ఇండియా హీరో. ఆయన సినిమాల కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. బాహుబలి సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన ప్రభాస్.. ఆ తర్వాత సినిమాలతో కూడా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపెడుతూనే ఉన్నాడు.
ప్రభాస్..రీసెంట్ గా ‘కల్కి 2898 ఏడి’ మూవీతో రూ. వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించింది. బాహుబలి 2 తర్వాత ఈయన నటించిన ‘కల్కి’ సినిమా ఈ ఫీట్ అందుకోవడం విశేషం.
ఇక ఎపుడు ప్రభాస్.. సినిమాలు.. ఆయన ఎపుడు పెళ్లి చేసుకుంటాడు అనే విషయాలు పక్కన పెడితే.. రెబల్ స్టార్ ఉంటున్న ఇళ్లు ఎలా ఉంటుందో తెలిస్తే ఆశ్చర్యపోవడం అభిమానులతో పాటు ప్రేక్షకుల వంతు అవుతుంది.
ప్రభాస్ ఇళ్లు ఓ ఇంద్ర భవనంలా ఉంది. లోపల వివిధ దేశాలకు చెందిన టైల్స్ తో చేసిన ఫ్లోరింగ్.. స్విమ్మింగ్ ఫూల్ వంటివి చూస్తే చూపు తిప్పుకోలేరు. స్విమ్మింగ్ ఫూల్ ఆరు బయట కాకుండా.. లోపల సీక్రెట్ గా ఉంది.
ఆ ఇంట్లో ఉండే గార్డెనింగ్ కూడా ఓ రేంజ్ లో ఉంది. ఈయన ఇల్లు హైదరాబాద్, జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 44, సీబీఐ కాలనీలో ఉంది. ఆ ఇంటిని మెయింటెన్స్ కోసం నెలకు దాదాపు రూ. 10 లక్షల వరకు ఖర్చు అవుతుందట.
ప్రభాస్ కు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోనే కాదు.. గండిపేటలో కూడా ఓ గెస్ట్ హౌస్ ఉంది. దాంతో పాటు సొంత ఊరులో కూడా తాతల కాలం నాటి ఇంద్ర భవనం ఉంది. దీంతో పాటు చెన్నై, బొంబాయి, బెంగుళూరులలో ఈయనకు వేల కోట్ల విలువ చేసే ఇళ్లు ఉన్నాయి.
అంతేకాదు ప్రభాస్ తన ఇంట్లో ఉన్న లేకున్నా.. రోజు ఓ 50 మందికి వంట వండుతారట. దాన్ని తన సన్నిహితులకు పంపిస్తారట. అంతేకాదు ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి ఎవరికీ తెలియకుండా సహాయం చేయడం ప్రభాస్ నైజం అని ఆయన సన్నిహితలు చెబుతుంటారు.