Salaar Part -1 Completes@1year: యేడాది పూర్తి చేసుకున్న ‘సలార్: పార్ట్ 1- సీజ్ ఫైర్’ .. మొత్తం కలెక్షన్స్ ఇవే..
Salaar Part -1 Completes@1year:పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ టైటిల్ రోల్లో యాక్ట్ చేసిన భారీ యాక్షన్ చిత్రం ‘సలార్: పార్ట్1-సీజ్‌ఫైర్’. ఈ ఆదివారంతో యేడాది పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ లభించింది. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్‌ను క్రియేట్ చేసిన ఈ చిత్రం సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.
భారీ తారాగణంతో కాన్వాస్, ఎంతో ఆశ్యర్యపరిచే యాక్షన్ సీన్స్ తో ఈ సినిమా యాక్షన్ జోనర్‌లో సరికొత్త పంథాను క్రియేట్ చేసింది. ప్రభాస్ మాస్ అప్పీల్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటన సహా అన్నీ ఎలిమెంట్స్ దీన్ని ఓ కల్ట్‌మూవీగా నిలబెట్టాయని చెప్పాలి.
ఓటీటీ మాధ్యమంలో ‘సలార్: పార్ట్1-సీజ్‌ఫైర్’ 300 రోజుల పాటు ట్రాప్ ట్రెండింగ్‌లో నిలిచి సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ అయిన ఈ చిత్రం అద్భుతమైన స్పందనను రాబట్టుకుంది.
‘సలార్: పార్ట్1-సీజ్‌ఫైర్’ యాక్షన్ తో ఊగిపోయిన ప్రేక్షకులు ఇపుడు ఈ మూవీకీ సీక్వెల్ గా సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కించారు.
సలార్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 347 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 350 కోట్ల షేర్ (రూ. 700.17 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. త్వరలో ఈ సినిమా రెండో భాగం సెట్స్ పైకి వెళ్లనుంది.