Telangana Chicken Recipe: తెలంగాణ ఫ్రైడ్ చికెన్..ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
Telangana Fried Chicken Recipe: మాంసాహారులు చికెన్ అంటే చాలా ఇష్టంగా తింటుంటారు.చికెన్ లో చాలా వెరైటీలు ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు లాగించేస్తుటారు. అయితే చికెన్ చాలా మంది రకరకాల వెరైటీలను ట్రై చేస్తుంటారు. ముఖ్యంగా తెలంగాణలో చికెన్ వెరైటీలు చాలా ఉంటాయి. అంకాపూర్ చికెన్,కుండా చికెన్, తాటికళ్లు చికెన్ ఇలా ఎన్నో వెరైటీలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సరికొత్తగా తెలంగాణ ఫ్రైడ్ చికెన్ ఓ సారి ట్రై చేయండి. ఎప్పుడూ ఒకేరకమైన చికెన్ కర్రీతిని బోర్ కొడితే..ఈ రుచికరమైన ఫ్రైడ్ చికెన్ టేస్టు చూడండి. ఈ చికెన్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. రుచితోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వర్షాకాలంలో సాయంత్రం స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు.
చికెన్ బ్రెస్ట్ -అరకేజీ, గుడ్డు -1, పెరుగు -1 కప్పు, 1 ½ టీస్పూన్ మాల్వానీ మసాలా, 1 కప్పు మల్టీగ్రెయిన్ పిండి, రుచికోసం బ్రెడ్ ముక్కలు 1 కప్పు, ఉప్పు రుచికి సరిపడా, డీప్ ఫ్రై కోసం నూనె, ఉల్లిపాయ-1, వెల్లుల్లి, ధనియాల పౌడర్, కారం చిటికెడు
ముందుగా స్టౌఆన్ మీడియం మంట మీద కడాయి పెట్టి అందులో బట్టర్ లేదా నెయ్యి లేదా నూనె పోయాలి. వేడెక్కిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి 2 -3 నిమిషాలు ఉడికించాలి.
ఇప్పుడు మాల్వానీ మసాలా ( గరం మసాల,మిరియాల పౌడర్, జీలకర్ర పౌడర్ )లో చికెన్ ముక్కలను వేసి 4-6 గంటలు రిఫ్రిజిరేటర్‌లో మెరినేట్ చేయండి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో గుడ్డు పగలకొట్టి పచ్చ,తెల్ల సొన రెండూ పోయండి. అందులోనే మజ్జిగ పోసి రెండూ మిక్స్ చేయండి.
మరొక గిన్నె తీసుకుని అందులో మల్టీగ్రెయిన్ పిండి, బ్రెడ్ ముక్కలు, ఉప్పు , ధనియాల పౌడర్, కారం వేసి కలపండి.
గుడ్డు మిశ్రమంతో మెరినేట్ చేసిన చికెన్ ముక్కలకు( మల్టీ గ్రెయిన్ పిండి, బ్రెడ్ ముక్కలు, ఉప్పు) వేసి కలిపిన మిశ్రమాన్ని ముక్కలకు పట్టించాలి.
ఇప్పుడు స్టౌ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో డీప్ ప్రైకి సరిపడే నూనె పోయాలి. నూనె వేడెక్కిన అనంతరం మసాల పట్టించిన చికెన్ ముక్కలు వేయాలి. ఈ చికెన్ ముక్కలు బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. అంతే సింపుల్ తెలంగాణ ప్రైడ్ చికెన్ రెడీ. ఈ ఫ్రైడ్ చికెన్ పిల్లలు ఇష్టంగా తింటారు. మీరూ ఓసారి ట్రై చేయండి.