Red Bananas For Diabetes Control: షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేసే ఎరుపు రంగు అరటిపండ్లు! ఎప్పుడైనా తిన్నారా?

తీవ్ర మధుమేహం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఎరుపు రంగు అరటి పండ్లను ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు అదుపులో ఉంటాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయి.

ఎరుపు రంగు అరటి పండ్లలో విటమిన్ బి6 అధిక మోతాదులో లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక లోపం, సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నవారు ప్రతి రోజు అల్పాహారంలో తీసుకోవడం వల్ల మంచి లాభాలు కలుగుతాయ.

ఎర్రటి అరటిపండులో విటమిన్ B6 అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి దీనిని షేక్‌లా తయారు చేసుకుని ప్రతి రోజు తాగితే శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణాన్ని పెరుగుతుంది. అంతేకాకుండా ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయి.
ఈ ఎర్రని అరటిపండ్లలో ల్యూటిన్ అనే మూలకం అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు దీనిని తీసుకోవడం వల్ల కంటి చూపు సమస్యలు దూరమవుతాయి. రేచికటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం చాలా మందిలో అధిక రక్తపోటు సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు కూడా ప్రతి రోజు ఎర్రటి అరటిపండును తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకోడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.