Redmi Note 12: రెడ్‌మి నోట్ 12.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్
Redmi Note 12 ధర EUR 199: విదేశాల్లో ఇది 199 యూరోలు ఉండగా.. మన భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 17,720కి సమానం అవుతుంది. రెడ్‌మి నోట్ 11 ఇండియాలో మొదటిసారిగా లాంచ్ అయినప్పుడు ఈ మోడల్ ప్రారంభ ధర రూ. 14,499 అనే విషయం మర్చిపోవద్దు.
Redmi Note 12 Phone: ఈ అప్‌కమింగ్ రెడ్‌మి ఫోన్ ముందు భాగంలో పంచ్-హోల్ సెల్ఫీ కెమెరాతో ఉన్న డిస్‌ప్లేను అమర్చారు. 120Hz డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్‌తో స్క్రీన్‌ని రిఫ్రెష్ చేస్తుంది.
Redmi Note 12 Phone: రెడ్‌మి ఫోన్ అధికారిక వెబ్‌సైట్‌లో రెడ్‌మి నోట్ 12 మెయిన్ ఫీచర్స్ ని పరిశీలిస్తే.. టీజర్ ప్రకారం క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగాన్ 685 SoC, 4G చిప్‌తో పనిచేయనుంది. 11GB RAM వరకు RAM పెంచుకోవడానికి అనుమతి లభిస్తుంది.
Redmi Note 12 Phone: రెడ్‌మి ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, అదనపు సెన్సార్ల ప్రత్యేకతలు, 48MP సెన్సార్, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ సెన్సార్, 2MP డెప్త్ కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నాయి. అలాగే 5,000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కూడా దీనిసొంతం.