Fridge Mistakes: ఇలాంటి పొరపాట్లు చేస్తే ఫ్రిజ్‌లు పేలిపోతాయి తెలుసా ?
కొన్నిసార్లు విద్యుత్ సరఫరాలో లోపాల కారణంగా విద్యుత్ హెచ్చు తగ్గులకు గురవుతుంది. అలా విద్యుత్ హెచ్చుతగ్గులకు గురయ్యే సమయంలో రిఫ్రిజిరేటర్‌ని ఆఫ్ చేయాలి. లేదంటే రిఫ్రిజిరేటర్ కంప్రెజర్‌పై ఒత్తిడి పెరిగి అది పేలుడుకు దారితీయొచ్చు.
కొన్ని సందర్భాల్లో రిఫ్రిజిరేటర్‌లో కూలింగ్ ఎక్కువై మంచు గడ్డ కట్టుకుపోతుంది. అలా గడ్డకట్టడం ఎక్కువైనప్పుడు మధ్యమధ్యలో ఫ్రిజ్ తెరిచి మంచుగడ్డను కరిగిపోయేలా చేయాలి. లేదంటే అది ఫ్రిజ్ నిండా నిండుకుపోయి కంప్రెషర్‌పై భారం పడేలా చేస్తుంది. అలాంటి సందర్భాల్లోనూ పేలుడు జరిగే ప్రమాదం ఉంటుంది.
రిఫ్రిజిరేటర్‌లో ఏవైనా సాంకేతిక లోపాలు తలెత్తితే ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ వద్దకే తీసుకెళ్లాలి. మరీ ముఖ్యంగా కంప్రెషర్‌లో ఏదైనా లోపం తలెత్తితే.. అలాంటి సమస్యలను కంపెనీకి సంబంధించిన ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ వద్దకే తీసుకెళ్లాలి. అలా చేస్తే వారు ఒరిజినల్ పార్ట్స్ బిగించి సమస్యను పరిష్కరిస్తారు. లేదంటే లోకల్ రిపేర్ షాప్స్ లో లోకల్ మేడ్ పార్ట్స్ బిగిస్తే.. అవి పేలుడుకు దారితీస్తాయి.
రిఫ్రిజిరేటర్‌లో ఏవి పెట్టకుండానే అలా నిరంతంరంగా నడిపించినట్టయితే.. ఏవైనా అందులో నిల్వ చేయాల్సి వచ్చినప్పుడు ఫ్రిజును పవర్ ఆఫ్ చేసి పని పూర్తయిన తరువాత పవర్ ఆన్ చేయాలి.
రిఫ్రిజిరేటర్‌ను ఉపయోగించేటప్పుడు దాని ఉష్ణోగ్రతను గమనిస్తూ ఉండాలి. ఉష్ణోగ్రతలు మరీ పడిపోతే.. రిఫ్రిజిరేటర్ కంప్రెసర్ పై ఒత్తిడి పెరిగి అది వేడెక్కుతుంది. అదే కానీ జరిగితే కొన్నిసార్లు కంప్రెషర్ ఆ ఒత్తిడిని హ్యాండిల్ చేయలేకపేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.