Reliance Jio Offer: వార్షికోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లు ప్రకటించిన జియో.. జొమాటో గోల్డ్ మెంబర్‌షిప్, 10 జీబీ డేటా ఫ్రీ..!
రిలయన్స్ జియో 8 వార్షికోత్సవం సందర్భంగా కస్టమర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. జియో వినియోగదారులు స్మార్ట్‌ఫోన్ రీఛార్జీ చేసుకున్నవారికి ముఖ్యంగా సెప్టెంబర్ 5 నేటి నుంచి 10 వరకు రీఛార్జీ చేసుకున్నవారు దాదాపు రూ.700 క్వార్టర్, యాన్యువల్ ప్లాన్స్‌పై పొందుతారు.
జియో యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్లను రూ.899, రూ. 999 రూ. 3599 తో రీఛర్జీ చేసుకుంటే కళ్లు చెదిరే లాభాలు రూ.700 బెనిఫిట్స్ పొందుతారు. ఈ మూడు ప్లాన్స్‌తో పాటు రూ.175 విలువైన 10 ఓటీటీ, 10 జీబీ డేటా వొచర్స్ 28 రోజులపాటు వ్యాలిడటీ పొందుతారు.
అంతేకాదు ఈ ప్లాన్‌లో జొమాటో గోల్డ్ మెంబర్‌షిప్ ఉచితంగా మూడు నెలలపాటు పొందుతారు. అజియో ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా రూ.2999 చేస్తే రూ.500 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది.
జియో రూ.899 తో రీఛార్జీ చేసుకుంటే ప్రతిరోజూ 2 జీబీ డేటా 90 రోజులపాటు వ్యాలిడిటీ, రూ.999 ప్లాన్‌తో ప్రతి రోజూ 2 జీబీ డేటా 98 రోజులపాటు వ్యాలిడిటీ పొందుతారు. అదే రూ.3,599 రీఛార్జీ ప్లాన్‌తో 2.5 జీబీ డేటా ప్రతిరోజూ 365 రోజులపాటు వర్తిస్తుంది. ఈ మూడు ప్లాన్లతో 10 ఓటీటీ, 10 జీబీ డేటా ప్యాక్‌తోపాటు అదనంగా 28 రోజల వ్యాలిడిటీ లభిస్తుంది.
జియోకు ఇప్పటి వరకు 490 మిలియన్ల సబ్‌స్క్రైబర్లను కలిగి ఉంది. జియో డిజిటల్ విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. అయితే, రిలయన్స్ జియో నెల్‌ఫ్లిక్స్ ఉచితంగా అందిస్తూ రెండు రీఛార్జీ ప్లాన్ల ధరలను కూడా పెంచిన సంగతి తెలిసిందే. రూ.1,099, రూ.1,499 పై కంప్లీమెంటరీగా నెట్‌ఫ్లిక్స్ ఉచితం అందిస్తుంది.