Jio Entertainment Plan: జియో నుంచి కొత్త ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్, 12 ఓటీటీలు ఉచితం
జియో సినిమా ప్రీమియం 28 రోజుల సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. మై జియో ఎక్కౌంట్ ద్వారా లభిస్తుంది. ఓటీటీ సేవలు పొందే ఆలోచన ఉంటే ఇది బెస్ట్ ఆప్షన్
జియో ప్రవేశపెట్టిన ఈ ప్లాన్‌లో యూజర్లకు సోనీ లివ్, జీ5, జియో సినిమా ప్రీమియం, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్స్ట్, కాంచ లంకా, ప్లానెట్ మరాఠీ, చౌపాయ్, హోయ్‌చోయ్, ఫ్యాన్ కోడ్, జియో టీవీ, జియో క్లౌడ్ ఉన్నాయి.
ఈ ప్లాన్‌లో యూజర్లకు 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఏ నెట్‌వర్క్‌కు అయినా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల సౌకర్యం ఉంటుంది. దాంతోపాటు 5జి నెట్‌వర్క్ కూడా ఉంటుంది.
ఇందులో భాగంగా బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ లాంచ్ చేసింది రిలయన్స్ జియో. ఇందులో యూజర్లకు రోడుకు 2జీబీ డేటాతో పాటు 12కు పైగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా లభిస్తాయి. ఈ ప్లాన్ 448 రూపాయలకు 28 రోజు వ్యాలిడిటీతో వస్తుంది
రిలయన్స్ జియో ఇటీవల రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెంచేసింది. టారిఫ్ ప్లాన్స్ ధరలను దాదాపు 25 శాతం వరకూ పెంచింది. దీంతో పాటు కొత్త ప్లాన్స్ కూడా ప్రకటించింది.