Herione: స్టార్ హీరోయిన్ కోసం పబ్లిక్ గా కొట్టుకున్న ఇద్దరు స్టార్ హీరోలు..ఎవరో తెలుసా ?

Sun, 29 Sep 2024-8:00 am,

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, రిలేషన్ షిప్స్, ఎఫైర్లు చాలా కామన్ గా జరుగుతూ ఉంటాయి. కొంతమంది హీరో హీరోయిన్లు తమ ప్రేమ విషయాన్ని బహిరంగంగా బయటపెడుతూ ఉంటారు.. మరికొందరు మాత్రం ఫాన్స్ తో దోబూచులాడుతూ ఉంటారు. ఇప్పుడున్న హీరో హీరోయిన్లలో పెళ్లయిన వాళ్లు అందరూ గతంలో వేరొకరితో రిలేషన్ షిప్ లో ఉన్నవాళ్లే. ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఒక బాలీవుడ్ హీరో మాత్రం.. ప్రేమ మత్తులో పడి తన కెరియర్ ని నాశనం చేసుకున్నాడు. ఆ హీరో మరి ఎవరో కాదు వివేక్ ఒబెరాయ్.

సురేష్ ఒబెరాయ్ తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వివేక్.. కంపెనీ అనే సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా స్టార్ స్టేటస్ అందుకున్నారు. అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన ఐశ్వర్యారాయ్ తో ప్రేమలో కూడా పడ్డాడు. అప్పటిదాకా బాగానే జరిగింది కానీ అక్కడే బెడిసికొట్టింది. 

ప్రేమ విషయాన్ని బహిరంగంగానే నిరూపిస్తూ వచ్చారు. పార్టీల్లోనూ, పబ్ లలోనూ కలిసి కనిపించేవారు. కొన్నాళ్ళు బాగానే సాగినప్పటికీ ఆ తర్వాత ఐశ్వర్యారాయ్ సల్మాన్ ఖాన్ కి క్లోజ్ గా కనిపించేవారు. దీంతో వివేక్ కి చాలా కోపం వచ్చింది. కోపంతో ఊగిపోయిన వివేక్ సల్మాన్ మీద విమర్శల వర్షం కురిపించారు. అదే సమయంలో సల్మాన్ ఖాన్ కూడా వివేక్ ని బెదిరించినట్లు వార్తలు వినిపించాయి.

ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే.. ఈ ఘటన తర్వాత ఐశ్వర్యరాయ్ వివేక్ కీ బ్రేకప్ చెప్పి సల్మాన్ ఖాన్ తో రిలేషన్షిప్ మైంటైన్ చేశారు. వాళ్ళిద్దరి ప్రేమ కథకి కూడా శుభం కార్డు పడలేదు. జింక నువ్వు చంపిన కేసులో సల్మాన్ ఖాన్ జైలుకి వెళ్ళగా.. అతనితో విడిపోయిన ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సల్మాన్ ఖాన్ మాత్రం పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే మిగిలిపోయారు. 

ఎక్కువగా కష్టాలు పడింది మాత్రం వివేక్ ఒబెరాయ్ మీద నెగెటివిటి పెరిగిపోయింది. ఈ ఘటన తర్వాత ఆయనకు ఆఫర్లు కూడా చాలా తగ్గిపోయాయి. ఇలా ఒక అమ్మాయి ప్రేమలో పడి తన కెరియర్ నాశనం చేసుకున్నారు వివేక్. తెలుగులో కూడా వివేక్ రక్త చరిత్ర, వినయ విధేయ రామ వంటి సినిమాల్లో నటించారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link