Renu desai mother: రేణు దేశాయ్ తల్లి కన్నుమూత.. వైరల్ గా మారిన పవన్ మాజీ భార్య పెట్టిన పోస్ట్..
రేణుదేశాయ్ తరచుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తన కూతురు అకిరా, ఆద్యల ఫోటోలు, వీడియోలను ఎక్స్ వేదికగా పోస్టులు చేస్తు రచ్చ చేస్తుంటారు. ఇటీవల రేణు దేశాయ్ మూవీస్ లో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
అదే విధంగా కొంత మంది నెటిజన్లు రేణు దేశాయ్ ను ట్రోల్స్ చేస్తు.. కాంట్రవర్షీ కామెంట్లు సైతం చేస్తుంటారు. వీరికి రేణు దేశాయ్ తనదైన స్టైల్ లో కౌంటర్ లు కూడా ఇస్తుంటారు.
ఈ క్రమంలో రేణు దేశాయ్ తల్లి కన్నుమూసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్ తన ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది.
పునరపి జననం.. పునరపి మరణం అంటూ.. పుట్టిన వారికి మరణం తప్పదు.. మరణించిన వారికి జననం తప్పదంటూ.. ఒక కొటేషన్ ను ఎక్స్ వేదికగా.. రేణు తల్లి పాత ఫోటోను పోస్ట్ చేసి క్యాప్షన్ జత చేసింది.
ఈ క్రమంలో రేణు అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. రేణు దేశాయ్ కు ఈ కష్ట కాలంలో బాధను దిగమింగుకునే శక్తిని ఇవ్వాలని భగవంతుడ్ని ప్రార్థిస్తు రెస్ట్ ఇన్ పీస్ .. ఓంశాంతి.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల సినిపరిశ్రమలో తరచుగా కొంత మంది సీనియర్ నటులు కన్నుమూయడం తీవ్ర మనోవేదనకు గురిచేస్తుందని చెప్పుకొవచ్చు. ఢిల్లీ గణేష్ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నెటిజన్లు, సినిమా ఇండస్ట్రీ వాళ్లు రేణు దేశాయ్ తల్లి మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది.