Renu Desai Second Marriage: రెండో పెళ్లికి రెడీ అవుతున్న పవన్ మాజీ భార్య రేణు దేశాయ్.. కామెంట్స్ వైరల్..

Mon, 04 Nov 2024-12:58 pm,

రేణు దేశాయ్..  పవన్ కళ్యాణ్ నుంచి  విడాకులు తీసుకున్నా.. కేరాఫ్ పవన్ కళ్యాణ్ అని పిలుస్తుంటారు. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. అయితే.. తన నుంచి విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకున్నారు.

ఈ కోవలో రేణు దేశాయ్.. అప్పట్లో రెండో పెళ్లికి రెడీ అయినట్టు అప్పట్లో చెప్పడం పెద్ద సంచలనే అయింది.  అంతేకాదు పెళ్లి కొడుకును కూడా చూసినట్టు చెప్పింది. అప్పట్లో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమె పై ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో రెచ్చిపోయారు.

రెండో పెళ్లిపై అపుడు రేణు చేసిన ఈ కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పట్లో రెండో పెళ్లి పై మాట్లాడిన రేణు.. ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. ప్రస్తుతం పవన్, రేణు దేశాయ్ పిల్లలైన అకిరానందన్, ఆద్యా పెద్ద వాళ్లయ్యారు. ఈ ఏజ్ లో మరో పెళ్లి చేసుకోవడం ఎందుకులే అని సైలెంట్ అయిపోయింది రేణు.

 

రేణు దేశాయ్.. దాదాపు ఇరవై నాలుగేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ తో నటించిన ‘బద్రి’ సినిమాతో పరిచయమైంది. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వీరిద్దరు పదేళ్లు సహ జీవనం చేసారు. అకిరానందన్ పుట్టిన తర్వాత వీళ్లిద్దరు పెళ్లి పీఠలు ఎక్కారు.

అప్పట్లో చిరంజీవి ప్రజా రాజ్యం పెట్టిన తర్వాత ప్రత్యర్థి పార్టీల నుంచి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయనే ఉద్దేశ్యంతో పవన్.. రేణు దేశాయ్ ను పెళ్లి చేసుకున్నాడనే కామెంట్స్ ప్రత్యర్థుల నుంచి వచ్చాయి. ఆ తర్వాత వీళ్లిద్దరు మనస్పర్థ కారణంగా విడిపోయారు. విడిపోయి కూడా దాదాపు పుష్కర కాలం కావొస్తోంది.

విడిపోయినా.. పిల్లల కోసం కలిసే ఉంటున్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్ .. పూణెలో ఉంటుంది. అటు హైదరాబాద్ లో రేణు కు ఓ ఇల్లు ఉంది. ఇక ఈమెకు తాత, తండ్రుల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ తో విడాకుల సందర్భంగా భారీగా భరణం వచ్చింది. అది ఎంతనేది తెలియదు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం రేణు దేశాయ్ ఎప్పటికీ వదినే.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link