CIBIL Score : ఇకపై సిబిల్ స్కోర్ బాధలు తీరడం ఖాయం..ఆర్బీఐ కొత్త రూల్స్ ఇవే..!!

Tue, 13 Aug 2024-12:34 pm,

Credit Score : లోన్ కోసం అప్లై చేసే కస్టమర్లకు శుభవార్త. ఇకపై మీరు క్రెడిట్ స్కోర్ కోసం తంటాలు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తాజాగా ఆర్బిఐ జారీ చేసిన ఆదేశాల ప్రకారం ప్రతి 15 రోజులకు ఒకసారి బ్యాంకులు క్రెడిట్ స్కోర్ ను అప్డేట్ చేయాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆదేశాలు జారీ చేశారు. సాధారణంగా బ్యాంకులు ఈ క్రెడిట్ స్కోర్ ను ఆధారం చేసుకొని లోన్లను ఇస్తూ ఉంటాయి.   

అయితే ఒక్కోసారి ఈ క్రెడిట్ స్కోర్ అనేది అప్డేట్ కాకపోవడంతో లోన్లు రిజెక్ట్ అవుతూ ఉంటాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా కాలంగా కస్టమర్లు తాము చెల్లించే రుణాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అని ఆశిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా క్రెడిట్ బ్యూరోలు సిబిల్, ఈక్విఫాక్స్ వంటి సంస్థలు క్రెడిట్ స్కోర్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేందుకు ఆర్బిఐ ఆదేశాలు ఉపయోగపడతాయి.

నిజానికి సత్వరంగా లోన్ కావాలంటే సిబిల్ స్కోర్ అనేది ఎక్కువగా ఉంటేనే బ్యాంకులు మీకు లోన్ అందిస్తాయి. సిబిల్ స్కోర్ ఎనిమిది వందల పైగా ఉంటే మీకు లోన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సిబిల్ స్కోర్ 700 కన్నా తక్కువగా ఉన్నట్లయితే మీ లోన్ వచ్చే అవకాశాలు దాదాపు సన్నగిల్లుతాయి. ఇక 600 కన్నా తక్కువగా ఉంటే లోన్ లభించడం దాదాపు అసాధ్యం అని చెప్పవచ్చు. 

ఒక్కోసారి క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించడం మర్చిపోతూ ఉంటాం. ఇలాంటి పొరపాటు చేసినప్పుడు మీ సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. అయితే బ్యాంకులు ఈ క్రెడిట్ స్కోర్ ను అప్డేట్ చేయకపోవడం వల్ల మీరు సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నప్పటికీ క్రెడిట్ స్కోర్ తక్కువగానే ఉంటుంది. అలాంటప్పుడు మీకు రుణం పొందే అర్హత తగ్గిపోతుంది.

ప్రస్తుతం ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రుణ చెల్లింపు దారులు ఊరట పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇకపై ఎప్పటికప్పుడు చెల్లించే బిల్లులకు సంబంధించి ప్రతి 15 రోజులకు ఒకసారి మీ క్రెడిట్ స్కోర్ అప్డేట్ చేయాలని బ్యాంకు లను ఆర్బిఐ ఆదేశించడంతో ఇకపై రుణాలు పొందే వారికి వారి అప్లికేషన్ సులభంగా ముందుకు వెళ్లడంతో పాటు లోన్ కూడా శాంక్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  

మీ క్రెడిట్ స్కోర్ తగ్గకుండా ఉండాలంటే సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లులను చివరి తేదీ కన్నా ముందే చెల్లిస్తూ ఉండాలి. అలాగే మీ ఇఎంఐ కూడా గడువు తేదీ కన్నా ముందే చెల్లిస్తే మంచిది అలాగే ఒకటి కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులను మెయింటైన్ చేయకపోవడమే మంచిది. నీ ఆర్థిక అవసరాల కోసం చిన్న చిన్న రుణాలు తీసుకోవద్దు ఇలా చేయడం వల్ల కూడా మీ సిబిల్ స్కోర్ దెబ్బ తినే ప్రమాదం ఉంది. అలాగే తరచూ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడం వల్ల కూడా సిబిల్ స్కోర్ తగ్గుతుంది అన్న విషయం గుర్తుంచుకోవాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link