Revanth Reddy: పాదయాత్రకు రేవంత్ సిద్ధం.. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేలా డైవర్షన్ పాలిటిక్స్?
కొత్త ఎత్తుగడ: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుండడం.. కాంగ్రెస్ ప్రభావం తగ్గిపోవడంతో రేవంత్ రెడ్డి సరికొత్త ఎత్తుగడ వేసుకున్నారు. దీనికితోడు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా పాదయాత్రకు సిద్ధమైన వేళ రేవంత్ యాత్ర త్వరగా చేపట్టాలని తొందర పడుతున్నారు.
కేటీఆర్ కు పోటీగా: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా పాదయాత్రకు సిద్ధమవుతున్నాడు. వారికి ఆదరణ రాకుండా.. ఏడాది పాలన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి రంగంలోకి దిగుతున్నట్లు చర్చ జరుగుతోంది.
మూసీ పేరిట: పేదల ఇళ్లు కూల్చేసి మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు చేపడతానని చెప్పిన రేవంత్ రెడ్డి దానికి గుర్తింపు తీసుకొచ్చేందుకు తంటాలు పడుతున్నారు. తాను చేపట్టే మూసీ ప్రాజెక్టుకు ప్రజా మద్దతు కూడగట్టేందుకు రేవంత్ యాత్రకు పూనుకున్నారు.
అక్కడి నుంచే: వాడపల్లి నుంచి మూసీ వరకు పాదయాత్ర చేస్తానని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
అప్పటి నుంచే: ఈనెల 8వ తేదీ నుంచి రేవంత్ పాదయాత్ర ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
యాదాద్రి నుంచి మొదలు: యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి యాత్రను ప్రారంభించనున్నారని సమాచారం. యాత్ర ప్రారంభం రోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
మూసీ పరివాహకం: అనంతరం మూసీ పరివాహక జిల్లాలైనా సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపడతారని సమాచారం.
అధికారంలో ఉండి: ఒక ముఖ్యమంత్రిగా ఉండి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. అధికారంలో ఉన్న పాదయాత్ర చేయడం ఇది వింతగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వైఫల్యాలు కప్పిపుచ్చి: పాదయాత్ర చేపట్టడం వెనుక తన పది నెలల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు.. తాను చేపట్టిన మూసీ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం కోసమే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపడుతున్నట్లు చర్చ జరుగుతోంది.