Justin Trudeau: అవును.. కెనడాలో ఖలిస్తానీలు ఉన్నారు.. సంచనల వ్యాఖ్యలు చేసిన జస్టిన్ ట్రూడో..
ఖలిస్తానీ మద్దతు దారులు చాలామంది కెనడాలో ఉన్నారు. అయితే వారు సిక్కు కమ్యూనిటీని మొత్తాన్ని ప్రతినిధులు కారు. అలాగే మోదిని అభిమానించే హిందువులు కూడా కెనడాలో ఉన్నారు. అలా అని వాళ్ళు కూడా పూర్తిగా హిందూ కమ్యూనిటీకి కెనడాలో ప్రతినిధులు కారు అని వ్యాఖ్యలు చేశారు.
భారత్ కెనడా దౌత్య పరంగా దూరం పెరుగుతూనే ఉంది. కెనడా భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతేనే ఉంది. కెనడా ప్రభుత్వం ఓట్లు కొల్లగొట్టడానికి ఇలా భారత్ పై రెచ్చిపోతుంది. అందుకే ఖలిస్తానీలకు కెనడా స్వర్గధామంగా మారింది అన్న భారత ఆరోపణలకి ఈ ట్రుడా చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చాయి.
ఇటీవల కెనడాలోని ఒక హిందూ మందిర అయినా బ్రాంటాన్ ఆలయం పై జరిగిన దాడి నేపథ్యంలో జస్టిన్ ట్రూడో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికప్పుడు మోదీపై అమిత్ షాపై అక్కసు వెళ్లగక్కుతున్న కెనడా ప్రభుత్వం ఈసారి మరోసారి ఖలిస్తానీ మద్ధతుదారులకు అండగా ఈ వ్యాఖ్యలు చేసింది.
ప్రధానంగా ఇండియా కెనడా మధ్యలో ఈ దూరం ఖలిస్తానీ టెర్రరిస్ట్ అయినా హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భాగంగా మొదలైంది. దీంతో ఇరుదేశల మధ్యలో దూరం బాగా పెరిగింది. ఖలిస్తానీ టెర్రరిస్టులకు మద్దతును ఇస్తూ కెనడా ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలు కూడా వీటిని గమనిస్తూనే ఉన్నాయి. మొత్తానికి మరో పాకిస్తాన్ గా కెనడా భారత్ పై కుట్రలు వేస్తూనే ఉంది.
వాస్తవానికి బ్రాంప్టన్ మందిరంలో హిందు భక్తులపై ఖలిస్తానీయుడు దాడి చేశాడు. దీనిపై కూడా కెనడా ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. ఈ దాడిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఈ దాడి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.