Roja, Sajjala: మళ్లీ ఫామ్‌లోకి ఆర్‌కే రోజా, సజ్జల.. మాజీ సీఎం జగన్‌ పక్కన ప్రత్యక్షం

Thu, 12 Sep 2024-6:08 pm,

RK Roja, Sajjala: అధికారంలో ఉన్నప్పుడు హల్‌చల్‌ చేసిన సజ్జల రామకృష్ణా రెడ్డి, ఆర్‌కే రోజా సెల్వమణి వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. సీఎంగా వైఎస్‌ జగన్‌ ఉన్న సమయంలో ప్రభుత్వ సలహాదారుగా సజ్జల, మంత్రిగా రోజా కీలకంగా వ్యవహరించారు.

RK Roja, Sajjala: అధికారంలో ఉనప్పుడు కీలకంగా ఉన్న రోజా, సజ్జల శాసన సభ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత కొన్నాళ్లు అదృశ్యమయ్యారు. వీరిద్దరూ వేర్వేరుగా దేశ, విదేశాల్లో పర్యటించారు.

RK Roja, Sajjala: ఈ క్రమంలోనే పార్టీకి దూరంగా ఉంటున్న రోజా త్వరలోనే వైఎస్సార్‌సీపీని వీడుతారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ అలాంటిదేమీ లేదని తాజాగా తెలిసింది.

RK Roja, Sajjala: తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం చిత్తూరు జిల్లా నాయకులతో  పార్టీ అధినేత వైఎస్‌ జగన్ నిర్వహించిన సమావేశానికి వారిద్దరూ హాజరయ్యారు.

RK Roja, Sajjala: ఈ సమావేశంలో నగరి మాజీ ఎమ్మెల్యే రోజా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గతంలో లేనట్టు ప్రత్యేక లుక్‌లో ఆమె కనిపించారు.

RK Roja, Sajjala: అధికారం కోల్పోవడానికి సజ్జల కూడా ఒక కారణమని.. ఆయన్ను పక్కన పెట్టారని జరుగుతున్న ప్రచారానికి తాజాగా జరిగిన సమావేశం తప్పని నిరూపించింది. ఆయన జగన్‌తో ఉన్నారని స్పష్టమైంది.

సజ్జల రామకృష్ణా రెడ్డి ఇకపై జగన్ వెంటే నిలవనున్నారని సమాచారం. పార్టీ వ్యవహారాలు, జగన్ వ్యవహారాలు మళ్లీ సజ్జల చూసుకుంటారని ప్రచారం జరుగుతోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link