Rohit-Kohli Retirement: ఇంకెన్నాళ్లు ఇలా ఆడతారు భయ్యా.. దయచేసి తప్పుకోండి.. రోహిత్-కోహ్లీకి BG సిరీసే ఆఖరిదా?
Rohit-Kohli Retirement: టీమిండియా స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ హోం టౌన్ లో తమ ఆఖరి టెస్టు సిరీస్ ఆడేశారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. దిగ్గజ స్పిన్ ద్వయం రవీంద్ర జడేగా, రవిచంద్రన్ అశ్విన్ మన పిచ్ లపై చివరిసారిగా బౌలింగ్ చేశారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం భారత క్రికెట్ ఫ్యాన్స్ లో ఎన్నో ప్రశ్నలు మొదలవుతున్నాయి. హోం టౌన్ లో న్యూజిలాండ్ తో ఎవరూ ఊహించని విధంగా పరాజయం పాలైంది టీమిండియా. దీంతో ఇద్దరు సీనియర్ల టెస్టు భవితవ్యంపై పూర్తి సందిగ్ధత నెలకొంది.
తాజాగా న్యూజిలాండ్ పై ఓటమి పట్ల బీసీసీఐ గుర్రుగా ఉంది. గత కొన్నాళ్లుగా టెస్టు ఫార్మాట్ ఫ్యూచర్ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా ఇలాంటి ఫలితం రావడం బీసీసీఐ జీర్ణించుకోలేకపోతుంది. దీంతో టెస్టు జట్టులో సమూల మార్పులు చేసేందుకు బీసీసీఐ రంగం సిద్ధం చేస్తోందని సమాచారం. ముఖ్యంగా సీనియర్స్అయిన రోహిత్, విరాట్, జడేజా, అశ్విన్ టెస్టు భవితవ్యంపై కూడా త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో టీమిండియాకు 2025 డబ్య్లూటీసీ ఫైనల్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. కొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫ్రీని 4-0 తో నెగ్గితేనే భారత్ మూడోవసారి ఫైనల్ కు చేరుకుంటుంది. అయితే ఈ సిరీస్ కు ఇప్పటికే జట్టును ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్వాడ్ లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. అయితే ఈ సిరీస్ టీమిండియా విఫలం అయితే వచ్చే ఏడాది ఇంగ్లాండ్ లో జరిగే మ్యాచుకు ఈ నలుగురు సీనియర్లకు చోటు ఉండదని బోర్డు మెంబర్ ఒకరు తెలిపినట్లు సమాచారం.
అయితే రోహిత్ శర్మ టెస్టు రిటైర్మెంట్ పై భారత మాజీ ఓపెనర్ క్రిష్ శ్రీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ శర్మ రాణించకపోతే టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెబుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అటు కోహ్లీ రిటైర్మెంట్ గురించి మాట్లాడటం ఇప్పుడు తొందరపాటు అవుతుందన్నాడు. కోహ్లీ రిటైర్మెంట్ కు ఇంకా చాలా సమయం ఉందన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో తన సత్తా చాటుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ లో విరాట్, రోహిత్ పేలవమైన ఫామ్ ను చూసిన టీమిండియా మాజీ వెటరన్ ఫాస్ట్ బౌలర్ కర్సన్ ఘావ్రీ రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇద్దరు సీనియర్లు ఆటలో రాణించలేకపోతున్నారని..ఒత్తిడిలో ఉన్నారన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో రాణించినట్లయితే టెస్ట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే అన్నారు. మంచి ప్రదర్శన కనబర్చకపోతే ఎన్నాళ్లు జట్టులో ఉంచుతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.