Ind vs Pak match: ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్.. ఫామ్‌లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు
KL Rahul - కేఎల్ రాహుల్ : విరాట్ కోహ్లీ సేనలో కీలకమైన ఆటగాళ్లలో ఓపెనర్ కె.ఎల్. రాహుల్ ఒకరు. ఐపిఎల్ 2021 లో పంజాబ్ కింగ్స్ తరపున 13 మ్యాచ్ లలో 626 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ టీ20 ఫార్మాట్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. (Twitter photo).
Varun Chakravarthy - వరుణ్ చక్రవర్తి : ఐపిఎల్ 2021 టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన వరుణ్ చక్రవర్తి లీడింగ్ వికెట్ టేకర్‌గా పేరు తెచ్చుకున్నాడు. 17 మ్యాచుల్లో 18 వికెట్లు పడగొట్టిన వరుణ్ చక్రవర్తి ఆదివారం పాకిస్థాన్‌పై సైతం తన ప్రతాపాన్ని చూపించాడంటే.. పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ తోకముడవాల్సిందే. (Twitter photo).
Ravindra Jadeja - రవీంద్ర జడేజా : ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఐపిఎల్ 2021 లో బ్యాట్‌తోనూ, బంతితోనూ రాణించి మంచి ఫామ్‌లో ఉన్నాడు. అది కూడా ఎం.ఎస్ ధోనీ నేతృత్వంలో ఐపిఎల్ 2021 ఛాంపియన్స్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ప్రాతినిథ్యం వహించాడు. 145 స్ట్రైకింగ్ రేటుతో కొనసాగుతున్న రవీంద్ర జడేజా.. ఈ సీజన్‌లో 13 వికెట్లు తీశాడు. (Twitter photo).
Rohit Sharma - రోహిత్ శర్మ : రోహిత్ శర్మ విషయానికొస్తే.. రోహిత్ శర్మ ఘనతను చూడ్డానికి కేవలం ఐపిఎల్‌ని ఉదాహరణగా తీసుకోనక్కర్లేదు. ఎందుకంటే.. టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లోనే 4 సెంచరీలు చేసి టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్న క్రికెటర్ మన రోహిత్ శర్మ. (Twitter photo)
Jasprit Bumrah - జస్ప్రిత్ బుమ్రా : టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో టీమిండియాకు ఉన్న పవర్‌ఫుల్ బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా కూడా ఒకరు. టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో బుమ్రా 59 వికెట్లు పడగొట్టాడు. 20.25 ఎక్స్‌లెంట్ బౌలింగ్ యావరేజ్‌తో, 6.66 ఎకానమి రేటుతో జస్ప్రిత్ బుమ్రా టీమిండియా నమ్ముకున్న బౌలర్లలో ముందుంటాడు. (Twitter photo)