Virat Kohli: ఈ చిన్నారిని గుర్తుపట్టారా..? విరాట్ కోహ్లీకి మేనేజర్.. ఇప్పుడు టీమిండియా స్టార్ క్రికెటర్ భార్య
ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి.. ప్రస్తుతం టీమిండియా స్టార్ క్రికెటర్ భార్య. అంతేకాకుండా ఆమెకు దాదాపు 10 కోట్ల ఆస్తి ఉంది.
కాస్త పోలికలు చూస్తే ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది కదా.. మరీ గుర్తుపట్టారా..?
ఎంతో క్యూట్‌గా ఉన్న ఈ అమ్మాయిని ఇంకా గుర్తుపట్టలేదా..? అయితే ఇదిగో సమాధానం.
క్యూట్‌గా ఉన్న ఈ అమ్మాయి మరెవరో కాదు.. టీమిండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే.
రితికా సజ్దే డిసెంబర్ 21, 1987న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు. రితికా ఆస్తి విలువ రూ.10 కోట్లు ఉంటుందని అంచనా.
రితికా సజ్దే స్పోర్ట్స్ మేనేజర్‌గా పనిచేశారు. గతంలో రన్ మెషీన్ విరాట్ కోహ్లీకి మేనేజర్‌గా కూడా ఉన్నారు. ఆ తరువాత హిట్‌మ్యాన్‌ను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.
రితికా సజ్దేహ్ తండ్రి బాబీ సజ్దే, తల్లి టీనా సజ్దే. రోహిత్ శర్మ, రితికల పెళ్లి 13 డిసెంబర్ 2015న ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్‌లో గ్రాండ్‌గా జరిగింది.