Ali Daughter Fatima Marriage : కమెడియన్ అలీ కూతురు వివాహాం.. చిరు, రోజా, నాగ్ సందడి
ఈ పెళ్లిలో రోజా సందడి ఎక్కువగా కనిపించింది. రోజా అలీ నాగార్జున కలిసి ముచ్చట్లు పెడుతున్న ఫోటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
అలీ ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య సలహాదారుగా నియామితులైన సంగతి తెలిసిందే. దీంతో ఈ పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
ఫాతిమా పెళ్లికి సంబంధించిన ప్రతీ ఈవెంట్ వీడియోను జుబేదా తన యూట్యూబ్ చానెల్లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. అలా పెళ్లి ఈవెంట్ ద్వారా కూడా క్యాష్ చేసేసుకుందన్న మాట.
పెళ్లికి రావాలని అలీ, జుబేదా దంపతులు ఏపీ సీఎంతో పాటు గవర్నర్ తమిళిసై మెగాస్టార్ చిరంజీవి, రేవంత్ రెడ్డి తదితర సెలబ్రిటీల ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
కమెడియన్ అలీ భార్య జుబేదా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తమ కూతురు ఫాతిమా పెళ్లికి సంబంధించిన ప్రతీ విషయాన్ని వీడియోగా చేసి యూట్యూబ్‌లో వదులుతూ వచ్చింది. ఇప్పుడు ఫాతిమా పెళ్లిలో చిరు దంపతులు సందడి చేశాడు.