Roja Selvamani Marriage pic : రోజా పెళ్లి ఫోటో వైరల్.. నాడు నేడు.. సెల్వమణి బర్త్ డే స్పెషల్ పిక్
సెల్వమణి బర్త్ డే సందర్భంగా తాజాగా రోజా తన పెళ్లి నాటి ఫోటోను షేర్ చేసింది. నా బెస్ట్ ఫ్రెండ్, సోల్ మేట్, నా జీవితంలో ఎన్నో మధుర క్షణాలను నింపిన సెల్వమణికి పుట్టిన రోజు అని ఎమోషనల్ అయింది.
నాడు నేడు అన్నట్టుగా రోజా తన పెళ్లి నాటి ఫోటోను షేర్ చేసింది. పెళ్లి సమయంలో తాను, తన భర్త ఎలా ఉన్నారో చూపించింది.. ఇప్పుడు ఎలా ఉన్నారో చూపించేలా రెండు ఫోటోలను షేర్ చేసింది.
రోజా తన భర్త సెల్వమణి బర్త్ డే సందర్భంగా తాజాగా రెండు ఫోటోలను షేర్ చేసింది. అందులో తన పెళ్లి నాటి ఫోటోను షేర్ చేసింది.
రోజా ఎప్పుడూ కూడా తన ఫ్యామిలీతో కలిసి ఉంటుంది. తన భర్త సెల్వమణి, పిల్లలతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంటుంది. దేవాలయాలను దర్శించుకుంటుంది.
రోజా ప్రస్తుతం స్క్రీన్‌కు దూరంగానే ఉంటోంది. మంత్రిగా ప్రమాణాస్వీకారం చేసినప్పటి నుంచీ నటనకు దూరంగా ఉంది. జబర్దస్త్ షోను వదిలేసింది. అయితే రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి టైం ఇస్తుంటుంది.
బుల్లితెరపై, వెండితెరపై రోజా తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు మంత్రిగా రోజా.. రాజకీయాల్లో తన మార్క్ క్రియేట్ చేస్తోంది. సోషల్ మీడియాలోనూ రోజా ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.