Romantic Cheating Story: ఏపీలో సంచలనం రేపుతున్న ముంబై మోడల్ . ఇండస్ట్రియలిస్ట్ వారసుడి ప్రేమ వ్యవహారం.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Tue, 27 Aug 2024-2:11 pm,

Romantic Cheating Story: ముంబై మోడల్ కి.. ఓ ఇండస్ట్రియలిస్ట్ మధ్య  లవ్ మ్యాటర్ లో ఏపీ పోలీసులు ఇన్వాల్స్ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వ  హయాంలో విజయవాడ పోలీసులు ఓ పెద్ద వ్యవహారాన్నే నడిపినట్లు జోరుగా  ప్రచారం జరుగుతోంది.సిక్స్ మంత్స్ బ్యాక్   విజయవాడలో నమోదైన ఓ కేసులో కొత్త కోణం బయటకు వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలోని ఓ పెద్ద మనిషి సహాకారంతోనే అప్పట్లో పోలీసు బాసులు ఆ ముంబై నటిని వేధించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

 

గుజరాత్ కు చెందిన ఓ మోడల్ కమ్ నటి కాదంబరి జెత్వానీ ముంబైలో ఉంటోంది. ఈమె తన ఈవెంట్స్ తో పాటు సినిమాలు చేసుకుంటూ బిజీబిజీగా ఉండేది. ఈ కోలవో  ఓ ప్రముఖ ఇండస్ట్రిలిస్ట్ వారసుడితో  ప్రేమలో పడింది. సదరు పారిశ్రామికవేత్త మనవడు ముంబైలో ఆ నటితో చెట్టాపట్టాలేసుకొని తిరిగాడు. ఆమె లవ్ లో మునిగిపోయాడు.

 

అయితే.. సదరు నటితో ప్రేమ వ్యవహారాన్ని అమ్మాయి తల్లిదండ్రులు ఆమోదించారు. కానీ అబ్బాయి వాళ్ల  ఇంట్లో పెద్దలు ససేమిరా అన్నారు.  కానీ దేశంలోనే అత్యంత ధనిక కుటుంబాల్లో ఒకటి కావడంతో నటితో ప్రేమను అబ్బాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. వారు వీరి మ్యారేజ్ కు నో చెప్పారు. ఆమెకు దూరంగా ఉండాలని ఆ యువకుడికి చెప్పి చూసినా ప్రయోజనం లేకపోవడంతో కుటుంబసభ్యులు మరో ప్లాన్ బి అమలు  చేశారు.

గత వైసీపీ ప్రభుత్వంలో అంతా తానై చక్రం తిప్పిన ఓ ముఖ్యమైన వ్యక్తికి ఈ ప్రేమ జంటను విడదీసేందుకు సదరు ఇండస్ట్రిలిస్ట్  ఫ్యామిలీ నుంచి డీల్ వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో భారీగానే డబ్బు చేతులు మారినట్టు సమాచారం.  ఇదంతా ఈ ఏడాది జనవరిలో జరిగింది. పెద్ద కుటుంబం నుంచి డీల్ రావడంతో ఏకంగా ఐపీఎస్ స్థాయి అధికారి ఓ సీఐను, ఎస్సైను తీసుకుని ముంబై వెళ్లారట.

పెళ్లి విషయం సెటిల్ చేస్తామని తీసుకువచ్చి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓ చోట ఫ్యామిలీని అనధికారికంగా నిర్భంధించినట్టు సమాచారం.   ప్రస్తుతానికి కైతే ఆ నటితో పాటు ఆమె కుటుంబ సభ్యులపై  కేసు నమోదై ఉంది. కానీ ఇదంతా బెదిరింపులో భాగమే అంటున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని మోసం చేసిన కేసులో వీళ్లను బెదిరించినట్టు సమాచారం.  ఆమె కుటుంబసభ్యుల ఫోన్లు తీసుకుని, వారి సోషల్ మీడియా ఖాతాల నుంచి ప్రేమ వ్యవహారానికి సంబంధించిన అన్ని ఫొటోలు, వీడియోలు డిలీట్ చేశారు. ఆ తర్వాత నటితో పాటు ఆమె కుటుంబసభ్యులపై అక్రమ కేసులు బనాయించి టార్చర్ చేశారనే  ప్రచారం జోరుగా సాగింది.

ఫిబ్రవరి 2024న చీటింగ్ కేసు పెట్టించి, ఆ ఫ్యామిలీన  విచారించినట్లు సమాచారం. నకిలీ డాక్యుమెంట్స్ ఇచ్చి నటి తనను  మోసం చేసిందని ఫిర్యాదులో  ఆ వ్యక్తి పేర్కొన్నాడు. తనకు మాయమాటలు చెప్పి ఆకట్టుకుందని.. తన నుంచి రూ. 5 లక్షలు వసూలు చేసిందని అతను ఫిర్యాదు చేశాడు.

అయితే బెయిల్ ఇచ్చిన వ్యక్తులను కూడా పోలీసులే ఏర్పాటు చేశారని.. ఫిర్యాదుదారుడు, బెయిల్ ఇచ్చినవారు, పోలీసులు కలిసి ఒక టీమ్ గా నడిపించినట్లు అర్థమవుతోంది. అయితే బాగా బెదిరించడంతో ప్రస్తుతం ఆమె ఏమి మాట్లాడకుండా సైలెంట్  అయిపోయింది. కేసు నడుస్తుండటంతో దీనిపై మాట్లాడేందుకు కూడా ఇష్టపడటం లేదనే సమాచారం ఉంది.

గవర్నమెంట్ మారిన తర్వాత జరిగిన ఈ తతంగ అంతా బయటకు వచ్చింది. పొలిటికల్ కారణాలతో ఈ విధంగా ప్రచారం చేస్తున్నారా.. లేక ఇదంతా నిజంగానే జరిగిందా అన్నవిషయం క్లారిటీ లేదు.  విజయవాడ పోలీసు వర్గాల్లో ఈ విషయమై పెద్ద చర్చ జరుగుతోంది. మాజీ పోలీసు బాస్ పై కక్ష పెంచుకున్న కొందరు పోలీసులే ఈ విషయాన్ని లీక్ చేశారని కూడా చెప్పుకుంటున్నారు.

స్పందించిన విజయవాడ సీపీ నటిపై వేధింపుల అంశంపై విజయవాడ నగర కమిషనర్  రాజశేఖర్ బాబు స్పందించారు. మీడియాలో కథనాలు చూశామన్నారు. అయితే తమను వేధించారంటూ ఏ నటిగానీ, ఆమె ఫ్యామిలీ నుంచి గానీ కంప్లైంట్ రాలేదన్నారు.. ఎవరైనా ఫిర్యాదు చేస్తే, కేసు నమోదు చేసి విచారణ చేపడతామని చెప్పారు. అప్పుడే ఇందులో విజయవాడ పోలీసుల పాత్ర ఉందా లేదో తెలిసే ఛాన్స్ ఉందన్నారు. మరి ఇంత జరిగిన సదరు పారిశ్రామిక వేత్త ఎవరు.. ? ఆ పొలిటికల్ లీడర్ ఎవరనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link