RRR Poster Editing Photos: ఆర్ఆర్ఆర్ మూవీ పోస్టర్ క్రేజ్ చూశారా, ఓ రేంజ్‌లో ఎడిటింగ్ చేసిన ఫ్యాన్స్

Wed, 30 Jun 2021-2:07 pm,

RRR Poster Editing Photos:  టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్ షూటింగ్ అప్‌డేట్ రానే వచ్చింది. సినిమా విడుదల తేదీపై సైతం ఓ క్లారిటీ వచ్చింది. తాజాగా విడుదలైన పోస్టర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. (Photos Credit: Twitter)

RRR Poster Editing Photos:  రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లను ఫ్యాన్స్ తమకు నచ్చిన తీరుగా తయారుచేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ట్రెండింగ్ అవుతున్నాయి. (Photos Credit: Twitter)

అక్టోబర్ 13, 2021నే మూవీ విడుదల కానుందని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఇప్పటివరకైతే పాత తేదీకే జక్కన్న రాజమౌళి ఫిక్సయినట్లు పోస్టర్ చెప్పకనే చెప్పింది.  (Photos Credit: Twitter)

తారక్ కొమురం భీమ్‌గా కనిపించనుండగా, అల్లూరి సీతారామరాజు పాత్రను మెగా హీరో రామ్ చరణ్ పోషించాడు. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్ జతకట్టగా, రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ నటి ఆలియా భట్ నటిస్తోంది.  (Photos Credit: Twitter)

అజయ్ దేవగణ్ పుట్టినరోజు కానుకగా మూవీ యూనిట్ అందించింది. ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్‌ఆర్‌ను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.  (Photos Credit: Twitter)

టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఆర్ఆర్ఆర్ ఒకటి. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని ఆశిస్తున్నారు. (Photos Credit: Twitter)

ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా విడుదల చేసిన పోస్టర్లను నెటిజన్లు కాస్త హాస్యా్ని జోడించి ఎడిటింగ్ చేవారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Photos Credit: Twitter)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link