Ruhani Sharma Photos: వైట్ స్లీవ్ లెస్ టాప్లో సెగలు రేపుతున్న రుహానీ శర్మ..
హిమాచల్ ప్రదేశ్ లో పుట్టి పెరిగిన రుహాని శర్మ ముందుగా పంజాబీ మ్యూజిక్ వీడియోస్ లో కనిపించి మంచి క్రేజ్ సంపాదించింది. తర్వాత తమిళంలో ఆమెకు హీరోయిన్గా అవకాశం లభించింది.
అయితే ఆ సినిమా సూపర్ హిట్ కాలేదు కానీ ఆమెకు మంచి అవకాశం అయితే తెచ్చిపెట్టింది. తెలుగులో చిలసౌ అనే సినిమాలో ఆమె అంజలి పాత్రలో నటించి ఒక్కసారిగా అందరి దృష్టిని తను వైపు తిప్పుకుంది.
తర్వాత ఏడాది కమల అనే సినిమాతో మలయాళంలో కూడా హీరోయిన్గా లాంచ్ అయింది కానీ పెద్దగా క్రేజ్ అయితే దక్కలేదు. ఇక ఆ తర్వాత తెలుగులో హిట్, డర్టీ హరి, నూట ఒక్క జిల్లాల అందగాడు, హర్ చాప్టర్ వన్, సైంధవ్ వంటి సినిమాల్లో కూడా ఆమె భాగమవుతోంది.
అదేవిధంగా పాయిజన్, మీట్ క్యూట్ వంటి వెబ్ సిరీస్లలో కూడా కనిపించింది. ఇక తనకు లైఫ్ ఇచ్చిన మ్యూజిక్ వీడియోస్ విషయంలో కూడా ఆమె ముందు నుంచి చాలా పాజిటివ్ గానే ఉంది.
అయితే ఈ మధ్య అవకాశాల కోసం ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఆమె రెచ్చిపోతుంది. తాజాగా షేర్ చేసిన ఫోటోషూట్ మీరు చూసేయండి