Sabitha Gold Pledge: 20 తులాల బంగారం తాకట్టు పెట్టిన సబితా ఇంద్రారెడ్డి
Sabitha Indra Reddy Gold: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా అందరికీ సుపరిచితురాలైన నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి. ఇక ప్రజలకు చేవెళ్ల చెల్లెమ్మ పేరుతో ఆమె సుపరిచితం.
Sabitha Indra Reddy Gold: భర్త మరణంతో ఆమె అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. అయిష్టంగానే వచ్చిన ఆమెను రాజకీయాల్లో అందరూ గౌరవంగా చూసుకుంటారు. చేవెళ్ల చెల్లెమ్మగా గుర్తింపు పొందిన సబిత మహేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు.
Sabitha Indra Reddy Gold: ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర దుమారం రేపింది. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా సబిత విశ్వరూపం చూపారు. రేవంత్‌పై విరుచుకుపడ్డారు. ఈ పరిణామంతో ఆమెను వరుసగా మీడియా సంస్థలు విచారణ చేపట్టాయి. ఈ సందర్భంగా ఆమె కొన్ని కీలక విషయాలను పంచుకున్నారు. ఆ క్రమంలోనే బంగారం తాకట్టు విషయాన్ని తెలిపారు.
Sabitha Indra Reddy Gold: సబితా భర్త ఇంద్రారెడ్డి తెలంగాణ కోసం పోరాడిన తొలి తరం నాయకుడు. తెలంగాణ కోసం ఆయన పాదయాత్ర ప్రకటించారు. అయితే ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. యాత్రకు సమయం ముంచుకొస్తుండడంతో డబ్బులేని పరిస్థితుల్లో తన భర్త కోసం సబితా ఇంద్రారెడ్డి తన 20 తులాల బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టారు. వచ్చిన డబ్బుతో తన భర్త ఇంద్రారెడ్డి పాదయాత్ర దిగ్విజయంగా జరిగింది.
Sabitha Indra Reddy Gold: హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో భర్త కట్టించిన ఇంటిలోనే ఇప్పటికే సబితా ఉంటున్నారు. మంత్రిగా పని చేసినా కూడా ఇక్కడి నుంచే పని చేసేవారు.
Sabitha Indra Reddy Gold: సర్పంచ్‌గా గెలిచిన ఇంద్రారెడ్డి అనంతరం నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పని చేశారు. మరణానంతరం సబిత రాజకీయాల్లోకి వచ్చిన వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వైఎస్సార్, కిరణ్ కుమార్, రోశయ్య, కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా పని చేసిన సుదీర్ఘ అనుభవం ఆమె సొంతం.
Sabitha Indra Reddy Gold: తెలంగాణ వచ్చాక తనకు అమితమైన గౌరవం ఇచ్చిన కేసీఆర్ వెంటే తాను ఉంటానని ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. బీఆర్‌ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.