Sai Dharam Tej: స్టార్ హీరోయిన్‌తో సాయి ధరమ్ తేజ్ పెళ్లి..? ఆ అందాల భామ ఎవరంటే..!

Thu, 25 Jul 2024-4:38 pm,

సాయి ధరమ్ తేజ్ పెళ్లి వార్తలు టాక్ ఆఫ్‌ ద టౌన్‌గా మారాయి. హీరోయిన్ మెహరీన్‌తో తేజ్ ప్రేమలో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.  

వీరిద్దరు కలిసి జవాన్ మూవీలో నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అంటున్నారు.   

గతంలో వేరే హీరోయిన్స్‌తో తేజ్ పెళ్లి అని వార్తలు వచ్చినా.. మెహరీన్‌తో మాత్రం భారీగా వస్తున్నాయి. అయితే ఈ విషయంపై సాయి ధరమ్ తేజ్ టీమ్ స్పందించింది.  

హీరోయిన్‌తో సాయి ధరమ్ తేజ్ పెళ్లి అని వస్తున్న వార్తలు అన్ని అవాస్తవమని స్పష్టం చేసింది. ఇవన్నీ పుకార్లేనని కొట్టి పారేసింది.   

పెళ్లి గురించి ఏదైనా విషయం ఉంటే తామే అధికారికంగా ప్రకటిస్తామని.. ఇలా పుకార్లను ప్రచారం చేయవద్దని కోరింది. దీంతో సాయి ధరమ్ తేజ్ పెళ్లి వార్తలు మరోసారి రూమర్లేనని తేలిపోయింది.  

ఇక సాయి ధరమ్ తేజ్ చివరగా తన మేనమామ పవన్ కళ్యాణ్‌తో కలిసి బ్రో మూవీలో నటించాడు. ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.  

మెహరీన్‌కు తెలుగులో అవకాశాలు పూర్తి తగ్గిపోయాయి. చివరగా స్పార్క్ లైఫ్‌లో మెరిసింది. ప్రస్తుతం ఓ కన్నడ మూవీలో యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.    

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link