Sai Pallavi: అమరన్ రిలీజ్ వేళ సాయి పల్లవికి బిగ్ షాక్.. ఆ వీడియోపై మరోసారి భగ్గుమంటున్న నెటిజన్లు..

Sat, 26 Oct 2024-11:53 am,

సాయి పల్లవి ఇటీవల కాలంలో తరచుగా వార్తలలో ఉంటున్నారు. కొన్నిసార్లు ఆమె తన సినిమాల పరంగా వార్తలలో ఉంటే, మరికొన్ని సార్లు మాత్రం.. ఏదో ఒక వివాదస్పద అంశంతో వార్తలలో ఉంటున్నారు.

గతంలో నిత్య మీనన్ కు గార్గి మూవీకిగాను జాతీయ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు ఆమె అభిమాను మాత్రం.. సాయి పల్లవికి రావాల్సిన అవార్డును నిత్యకు ఇచ్చారని ఫైర్ అయ్యారు.   

సోషల్ మీడియాలో సాయి పల్లవి ఫ్యాన్స్ వర్సెస్ నిత్యమీనన్ ఫ్యాన్స్ లా మారిందని చెప్పుకొవచ్చు. దీంతో ఇది కాస్త నిత్య మీనన్, సాయి పల్లవిల మధ్య అఘాతం క్రియేట్ చేసిందని కూడా వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉండగా.. సాయిపల్లవి, శివకార్తీకేయర్  ప్రధాన పాత్రల్లో పోషించిన అమరన్ చిత్రం రిలీజ్‍కు రెడీ అవుతోంది. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31వ తేదీన ఈ మూవీ విడుదల కానుంది.  పాకిస్థాన్ ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన అమర జవాన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే.  

ఈ సినిమాలో.. ముకుంద్ పాత్రను.. కార్తీకేయర్ పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సాయిపల్లవి గతంలో ఇండియన్ ఆర్మీపై చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ గా మారాయి. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రాజేసినట్లు తెలుస్తొంది.

 విరాట పర్వం సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ఉగ్రవాదం గురించి సాయిపల్లవి వివాదస్పదంగా మాట్లాడినట్లు తెలుస్తొంది. ఒకప్పుడు చట్టాలు లేని కాలంలో హింస జరిగిందంటే.. ఏదో అనుకొవచ్చు. కానీ ఇప్పుడు ఇంతగా డెవలప్ అయిన కూడా హింసలు జరగటం కరెక్ట్ కాదన్నారు.

ఇండియన్ వాళ్లను పాక్ శత్రువులుగా, పాక్ వాళ్లను ఇండియన్ ఆర్మీ శత్రువులుగా భావిస్తుంటామన్నారు. కానీ ఆలోచన దృక్పథం మార్చుకొవాలన్నారు. దీన్ని చూసిన నెటిజన్లు అప్పట్లోనే.. పాక్ మనం ఒక్కటనడానికి మనస్సు ఎలా వచ్చిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. 

పాకిస్థాన్ సైనికులు అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చి అమాయకులైన భారతీయుల ప్రాణాలు తీస్తుంటారని కామెంట్లు చేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ, పాక్ ను ఒక్కటే అంటూ సాయి పల్లవి గతంలో పోల్చుకుంటూ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మరోసారి భగ్గుమంటున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link