Sai Pallavi: ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోనున్న సాయి పల్లవి.. నిజమేనా..?
చిత్ర పరిశ్రమలో అందంతో పాటు వ్యక్తిత్వంతో కూడా మంచి పేరు సొంతం చేసుకున్న సాయి పల్లవి, సహజమైన అందంతో అందరినీ ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ తొలిసారి ఫిదా సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. సినిమాలను ఎంపిక చేసుకోవడంలో ఆచితూచి వ్యవహరించే ఈమె.. తన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా తన పాత్ర సాంప్రదాయాన్ని ప్రతిబింబించడంతోపాటు ముద్దు సన్నివేశాలు , చిట్టిపొట్టి బట్టలు ఉండకుండా జాగ్రత్తపడుతుంది.
ఇవన్నీ కచ్చితంగా దర్శకుడు కి చెప్పి వారికి ఓకే అయితేనే సినిమాకు సంతకం చేస్తుంది. ముఖ్యంగా నిర్మాతల హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది సాయి పల్లవి. ఇకపోతే తాను నటించిన సినిమా ద్వారా నిర్మాతకు నష్టం కలిగింది అని తెలిస్తే మాత్రం తన పారితోషకం వెనక్కి ఇచ్చిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇలాంటి ఒక అద్భుతమైన వ్యక్తిత్వం సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఈమెకే సొంతం అని అభిమానులు కూడా చెబుతూ ఉంటారు.
ఇకపోతే సినిమా జీవితానికే కాదు వ్యక్తిగత జీవితానికి కూడా కాస్త సమయం ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల తన చెల్లెలు పూజా కన్నన్ వివాహం ఘనంగా జరిపించింది . ఈ ఫోటోలు సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈమె కులాంతర వివాహం గురించి గతంలో చేసిన కామెంట్లు ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారుతున్నాయి.
సాయి పల్లవి మాట్లాడుతూ.. నా చిన్నతనంలో మా కమ్యూనిటీలోనే వివాహం చేసుకోవాలని చెప్పేవారు. అయితే అలా చెప్పిన వారే కమ్యూనిటీని దాటి ఇంకో కమ్యూనిటీకి చెందిన వ్యక్తులను వివాహం చేసుకొని, ప్రస్తుతం సంతోషంగా ఉంటున్నారు. అయితే వారు ఇప్పుడు మా ప్రాంతంలో నివసించడం లేదు.
ముఖ్యంగా మా కమ్యూనిటీ వారు వేరే కమ్యూనిటీ వ్యక్తులను వివాహం చేసుకుంటే, వారికి ఎటువంటి వేడుకలకు ఆహ్వానం ఉండదు. అంతేకాదు మా కమ్యూనిటీలో ఎవరైనా మరణించినప్పుడు చేసే అంత్యక్రియలకు కూడా వారిని రానివ్వము అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది.
ఇకపోతే తన అమ్మానాన్న కోయంబత్తూర్ లో ఉంటున్నారని తెలిపిన ఈమె, మన గురించి బయట ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటారని అయితే అవేవి పట్టించుకోవదని పిల్లలను బ్లాక్మెయిల్ చేయకూడదని , అది చాలా ఇబ్బందికరంగా ఉంటుందని తన తండ్రితో చెప్పినట్లు తెలిపింది. మొత్తానికైతే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ పై తన అభిప్రాయాన్ని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది సాయి పల్లవి