Sai pallavi Vacation: సాయి పల్లవి అందుకే డిఫరెంట్..!.. చెల్లితో కలిసి బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న నేచురల్ బ్యూటీ.. పిక్స్ వైరల్..
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఇటీవల తరచుగా వార్తలలో ఉంటున్నారు. అమరన్ మూవీ హిట్ అయిన విషయం తెలిసిందే. అదే విధంగా ఈ మూవీ అనేక కాంట్రవర్సీ అంశాల పరంగా కూడా వార్తలలో నిలిచిందని చెప్పుకొవచ్చు.
సాయిపల్లవి ప్రస్తుతం తండేల్, రామాయణ మూవీల్లో నటిస్తున్నారు. అయితే.. రామాయణం మూవీలో నటించడం వల్ల ఆమె నాన్ వెజ్ మానేశారని.. పూర్తిగా వెజిటెరియస్ అయిపోయారని రూమర్స్ వైరల్ అయ్యాయి.
దీనిపై సాయి పల్లవి సీరియస్ అయ్యారు. అదే విధంగా ఇక మీదట ఇలాంటి లేనీ పోనీ ఆరోపణలు చేస్తే లీగల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ క్రమంలో సాయి పల్లవి తాజాగా, ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు ఉన్నారు.
తాజాగా సాయిపల్లవి , తన చెల్లెలు పూజా ఖన్నన్ తో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు ఉన్నారు. సాధారణంగా ఎక్కువ మంది వెకెషన్ అనగానే.. బాయ్ ఫ్రెండ్ తో.. బికీనీల్లో హల్ చల్ చేస్తుంటారు.
కానీ సాయి పల్లవి మాత్రం.. తన సోదరి, ఫ్రెండ్స్ తో వెకెషన్ కు వెళ్లినట్లు తెలుస్తొంది.దీంతో సాయి పల్లవి మరోసారి తన యూనీక్ నెస్ ను చూపించుకున్నట్లైంది. నెట్టింట తాజాగా, సాయిపల్లవి ఆస్ట్రేలియా వెకెషన్ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
అదే విధంగా సాయి పల్లవి ఆసీస్ వెకెషన్ లో మాత్రం బీచ్ లో స్నానం చేస్తు చిల్ అయ్యినట్లు తెలుస్తొంది. తన సోదరి ఇంకా ఫ్రెండ్స్ తో అనేక ఫోటోలు దిగుతూ రచ్చ చేశారు. దీంతో మరోసారి సాయి పల్లవి వార్తలలో నిలిచారు.