Salman khan: సల్మాన్ ప్రాణాలు కాపాడుతున్న శక్తివంతమైన బ్రాస్ లేట్..?.. దాని స్పెషాలిటీ, ఆయనకు ఎవరిచ్చారో తెలుసా..?

Fri, 18 Oct 2024-5:43 pm,

బాలీవుడ్ నటుడు సల్మాన్ కు బిష్ణోయ్ గ్యాంగ్ చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా, ఆయనకు మరోమారు మాస్ వార్నింగ్ ఇచ్చారు. తమకు రూ. 5 కోట్లు ఇస్తే వదిలేస్తామని చెప్పారు. ఏకంగా పోలీసులకే వాట్సాప్ సందేశం పంపారు.

కొన్నిరోజులు క్రితం సల్మాన్ కు మంచి స్నేహితుడు, బాబా సిద్దీఖీని బిష్ణోయ్ గ్యాంగ్ అత్యంత క్రూరంగా హతమార్చారు. అంతే కాకుండా.. ఆ తర్వాత సల్మాన్ ను కూడా చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.  దీంతో పోలీసులు సల్మాన్ ఇంటి దగ్గర గట్టి బందో బస్తు సైతం ఏర్పాటు చేశారు.  

ఇదిలా ఉండగా సల్మాన్ ఖాన్ పలు మార్లు బిష్ణోయ్ గ్యాంగ్ కుట్రల నుంచి వెంట్రుక వాసిలో తప్పించుకున్నారు. అయితే.. దీని వెనుకాల ఆయన ప్రాణాలు కాపాడుతోంది మాత్రం నీలం రంగు బ్రాస్ లేట్ అని తెలుస్తోంది.

గతంలో సల్మాన్ ఖాన్ స్వయంగా తన తండ్రి నుంచి తనకు నీలం రంగు బ్రాసెలేట్ వచ్చిందని, అదిఎంతో మహిమగలదని కూడా చెప్పారు.  ముఖ్యంగా ఆ బ్రాస్ లేట్ అనేది నెగెటివ్ ఎనర్జీని దూరం చేస్తుందన్నాడు. 

 సల్మాన్ ఖాన్ చేతికి ఎల్లప్పుడు బ్రాస్లెట్ ఉంటుంది. ఆయన తండ్రి కూడా ఇదే విధంగా బ్రాస్ లేట్ ధరించే వాడని ఇది ఎంతొ శక్తివంతమైందని కూడా చెప్పుకొచ్చాడు.  ముఖ్యంగా ఈ బ్రాస్ లేట్ కు.. ఒక స్టోన్ ఉంటుంది.  ఈ రత్నాన్ని ఫిరూజా అని పిలుస్తారంట

ఈ బ్రాస్ లేట్ ధరించడం అదృష్టమని, కష్టాల తొలగిపోతాయని సల్మాన్ కు వాళ్ల తండ్రి చెప్పాడంట. ఎలాంటి దుష్ట శక్తుల్ని, చెడు ఫలితాల్ని అయిన దూరం చేస్తుందంట. అందుకే సల్లు భాయ్ ఈ బ్రాస్ లేట్ ను ఎప్పుడు వేసుకునే ఉంటాడంట.

ఇప్పటి వరకు ఈ బ్రాస్ లేట్ వల్ల తాను.. అనేక నెగెటివ్ ప్రభావాలు, పరిస్థితుల నుంచి బైటపడినట్టు  కూడా సల్లు భాయ్ చెప్పుకొచ్చారు. అయితే.. ఇటీవల బాబా సిద్దీఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్ కొంత ఆందోళనలకు గురయ్యారంట. దీంతో మరోమారు ఈ బ్రాస్ లేట్ కు చెందిన స్టోరీ వార్తలలొ నిలిచింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link