Salman Khan: బిష్ణోయ్ దెబ్బకు వణికిపోతున్న కండల వీరుడు.. కోట్లు ఖర్చుచేసి మరో బుల్లెట్ ప్రూఫ్ కారు.. ఫీచర్స్ ఇవే..

Sat, 19 Oct 2024-10:43 pm,

సల్మాన్ ఖాన్ ను బిష్ణోయ్ గ్యాంగ్ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారని చెప్పవచ్చు. బాలీవుడ్ స్టార్ ఇప్పుడు మాత్రం సెక్యురిటీ ల మధ్య బందీగా ఉంటున్నారని సమాచారం.  ఇటీవల బిష్ణోయ్ గ్యాంగ్ ఏకంగా ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ కూడా చేశారు. రూ. 5 కోట్టివ్వకుంటే సల్మాన్ ను చంపేస్తామన్నారు. ఈ క్రమంలో ముంబై పోలీసులు సల్మాన్ నివాసంలో అదనపు బందో బస్తు కేటాయించారు.

ఇప్పటికే 60 మంది వరకు ప్రైవేటు భద్రత సల్మాన్ ఇంటి చుట్టుపక్కల పహార కాస్తుంటారు. అదే విధంగా సల్మాన్ కు.. వై కేటాగిరి భద్రత ఇచ్చే విషయంలో మహా సర్కారు ఆలోచిస్తుందంట.

సల్మాన్ మాత్రం.. బైటకు వెళ్లాలంటేనే తెగ భయపడిపోతున్నారంట. గతంలో ఆయన మచ్చల జింకను చంపి తిన్నందుకు.. బిష్ణోయ్ గ్యాంగ్ ఆయనపై కోపం పెంచుకున్నట్లు తెలుస్తోంది.అందుకే ఆయన క్లోజ్ ఫ్రెండ్ బాబా సిద్దీఖినీ దసరా రోజు కాల్చి చంపారు.

ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ మరో కొత్త కారు ఖరీదు చేశారంట. దుబాయ్ నుంచి 2 కోట్లు పెట్టి బుల్లెట్ ప్రూఫ్ కారును కొన్నారంట.  ఇది బుల్లెట్ ప్రూఫ్ గా ఉంటుంది. నిస్సాన్ పెట్రోల్ ఎస్ యూవీని కొనుగోలు చేశారు.దీనిలో పేలుడు హెచ్చరిక సూచికలు, పాయింట్ బ్లాంక్ బుల్లెట్ షాట్ కొట్టిన కూడా దీని లోపలున్న వాళ్లకు ఏంకాదు.

అంతేకాకుండా.. గాజు షీల్డ్ మందంగా ఉంటుంది.  గతంలో సల్మాన్ ఖాన్..  యూఏఈ నుంచి ఒక బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేశారు. తాజాగా, తన భద్రత కోసం ఈ కారును కోనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link