Salman Khan: ఉలిక్కిపడిన బాలీవుడ్.. సల్మాన్ కు మళ్లీ బెదిరింపులు.. ఈసారి ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు..
సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తొంది. ఈమేరకు ముంబై పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మరోక వాట్సాప్ మెస్సెజ్ వచ్చినట్లు తెలుస్తొంది. సల్మాన్ ను చంపేస్తామని అందులో ఉంది.
కండల వీరుడిని చంపుతామని మరో మెస్సెజ్ రావడంతో ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు కోట్లు ఇవ్వకుంటే.. సల్మాన్ ను చంపేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఒక్కసారిగా బాలీవుడ్ ఉలిక్కిపడినట్లు తెలుస్తొంది
గతంలో సల్మాన్ ను కూడా ఇదే విధంగా బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు ఐదు కోట్లు ఇవ్వాలని కూడా బెదిరింపులకు గురిచేశారు. అంతే కాకుండా.. ఒక వేళ తమ వార్నింగ్ ను లైట్ ను తీసుకుంటే.. బాబా సిద్దీఖీ కన్న ఘోరంగా చావు ఉంటుందని కూడా మాస్ వార్నింగ్ ఇచ్చారు.
దీంతో రంగంలోకి దిగిన ముంబై పోలీసులు జార్ఖండ్ కు వెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అంతే కాకుండా.. 5 కోట్లివ్వాలని డిమాండ్ చేసిన వ్యక్తి కూరగాయలు అమ్మే వ్యక్తి షేక్ హుస్సేన్ షేక్ మాసిన్ గా తెలుస్తొంది. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు
తాజాగా, బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఇటీవల బీహార్ఎంపీ పప్పు యాదవ్ కు కూడా బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తొంది. దీంతో తనకు భద్రత పెంచాలని కూడా కేంద్రం ముందు తన గొడును వెలిబుచ్చుకున్నారు.
ఇదిలా ఉండగా.. సల్మాన్ కు మరోసారి బెదిరింపులు రావడం ప్రస్తుతం పెనుదుమారంగా మారింది. దీనిపైన కూడా పోలీసులు విచారణ చేపట్టారు. సల్మాన్ ఖాన్ హమ్ ఆప్ కే హయ్ కోన్ సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్ కు వెళ్లినప్పుడు అక్కడ మచ్చల జింకను వేటాడినట్లు సమాచారం. దీంతో అప్పటి నుంచి బిష్ణోయ్ తెగ సల్మాన్ మీద పగను పెంచుకున్నట్లు తెలుస్తొంది..