Samantha: సమంత దినచర్య చూశారా.. రోజూ ఏం చేస్తుందో తెలిస్తే షాక్..!

Sat, 19 Oct 2024-7:59 am,

సమంత ప్రస్తుతం వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.. త్వరలోనే అమెజాన్ వేదికగా స్ట్రీమింగ్ కి సిద్ధం కానుంది. ఈ నేపథ్యంలోనే సమంతకు సంబంధించిన ఒక విషయం వైరల్ గా మారింది.

సమంత దినచర్య ఏంటి..? ఆమె ప్రతిరోజు ఉదయం లేచింది మొదలు.. నిద్రించే వరకు ఏం చేస్తుంది అని తెలుసుకోవడానికి అభిమానులు సైతం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

ఉదయం 6:30 గంటలకు నిద్రలేచి సూర్యుడు నుంచి విటమిన్ డి పొందుతుందట.   

ఆ తర్వాత ఉదయం 7 గంటలకు జిమ్ కు వెళ్తుందట. ఉదయం 8 గంటలకు ఇంటికి వచ్చి స్నానమాచరించి దేవుడికి దీపం పెడుతుందట.   

ఆ తర్వాత 8:30గంటలకు బ్రేక్ ఫాస్ట్ ముగించుకొని ,  9:00 గంటలకు షూటింగ్ స్పాట్ కి వెళుతుందట. 

అక్కడికి వెళ్లిన తర్వాత ముఖానికి ఐస్ క్యూబ్స్ తెరపి చేసుకొని, ఆ తర్వాత మేకప్ వేసుకొని షూటింగ్ లో పాల్గొంటుందని సమాచారం. ఇక సాయంత్రం 6:00 గంటలకు షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత.. రెడ్ లైట్ కింద బాడీ థెరపీ చేయించుకుంటుందట.

రాత్రి 7 గంటలకు టెన్నిస్ ఆడి.. ఆ తర్వాత డిన్నర్ చేసి 9:30 గంటలకు యోగా చేసి,  10:00 గంటలకు పడుకుంటుందట.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link