Samantha: సరికొత్త లుక్‌లో సమంత.. ఇలా మారిపోయిందేంటి

ఇటీవల శాకుంతలం మూవీకి డబ్బింగ్ చెబుతున్న సామ్ షేర్ చేసింది. బెడ్ మీద పడుకునే డబ్బింగ్‌ను పూర్తి చేసినట్లుగా ఆ పిక్‌లో ఉంది.

దీంతో మయోసైటిస్‌తో ఇంకా సమంత కోలుకోలేదమో అని అభిమానులు కంగారు పడ్డారు. అయితే శాకుంతలం మూవీ ప్రమోషన్స్‌కు హాజరవుతుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గుణశేఖర్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కింది.
గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సామ్.. మళ్లీ ఇప్పుడెప్పుడే యాక్టివ్ అవుతోంది.
శాకుంతలం భంగిమలో ఉన్న తన ఫొటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ సినిమాలో ఎక్స్‌ప్రెషన్స్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు చెప్పింది.