Samantha: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సామ్.. అసలేమైంది..?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న సమంత తెలుగు స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి పేరు సొంతం చేసుకుంది. తన మొదటి చిత్రమైన ఏ మాయ చేసావే సినిమా ద్వారా మంచి పేరు సొంతం చేసుకున్న సమంత, అదే సినిమాలో తనకు జోడీ గా నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడి ఏడేళ్ల పాటు ప్రేమాయణం సాగించి పెళ్లి చేసుకుంది. వివాహం జరిగిన నాలుగు సంవత్సరాలకి విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత ఎవరికివారు విడివిడిగా ఉంటున్న విషయం తెలిసిందే.ఇటీవల నాగచైతన్య ప్రముఖ హీరోయిన్ శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు.
ఇదే సమయంలో సమంత పై బాలీవుడ్ లో రూమర్స్ వినిపించాయి. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ తో ఈమె ప్రేమలో ఉందని, అతడితో నిశ్చితార్థం చేసుకోబోతోంది అంటూ వార్తలు రాగా దీనిని ఖండించింది సమంత. ప్రస్తుతం మయోసైటీస్ వ్యాధి బారిన పోరాడుతూ మళ్లీ రియంట్రీ ఇచ్చిన ఈమె నిర్మాతగా మారి మా ఇంటి బంగారం అనే సినిమాను నిర్మిస్తోంది.
ప్రస్తుతం ఈమె చేతిలో నటిగా సిటాడెల్ వెబ్ సిరీస్ మాత్రమే ఉంది. ఇకపోతే సినిమాలు ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ వార్తల్లో నిలుస్తోంది సమంత. మొన్నటికి మొన్న వరల్డ్ పికిల్ బాల్ లీగ్ లో చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన ఈమె.. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలు షేర్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ ఫోటోలలో సమంత చాలా సన్నబడిందని నెట్టింట కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా కనిపించిన ఫోటోలలో అసలు గుర్తుపట్టలేనంతగా, చాలా బక్కపీలగా మారిపోయింది. అసలు సమంతా ఇదేంటి ఇలా అయిపోయింది అంటూ అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది జీరో ఫిగర్ మెయింటెన్ చేస్తుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన ఫ్యాషన్ ఈవెంట్లో ఇలా కనిపించిన సమంతాను చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సమంత ముఖంలో మునుపటి ఆకర్షణ లేదంటూ చాలా సన్నగా మారిపోయిందంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. మరొక నెటిజన్ ఒక అడుగు ముందుకేసి శోభిత, నాగచైతన్య నిశ్చితార్థం చేసుకున్న కారణంగా సమంత బెంగ పెట్టుకుని, ఇలా అయిందంటూ ఎవరికి తోచిన వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు ఏది ఏమైనా సమంత లుక్ అందరిని ఆశ్చర్యపరుస్తోంది అని చెప్పవచ్చు.