Samantha New Year photos: సంవత్సరం మొదటి రోజు సమంత ఏమి చేసిందో తెలుసా..?

Thu, 02 Jan 2025-12:39 pm,

సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. నాగచైతన్య హీరోగా వచ్చిన ఏం మాయ చేసావే సినిమాతో పరిచయమై నిజంగానే అందరిని మాయ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వరస సినిమాలు చేస్తూ తెలుగులో ఎన్నో విజయాలు అందుకుంది. 

సినిమాల పరంగానే కాకుండా పర్సనల్ లైఫ్ ద్వారా కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈ హీరోయిన్. ముఖ్యంగా సమంతకి ఆరోగ్య సమస్యలు వచ్చిన దగ్గరనుంచి.. ఈ హీరోయిన్ మరెన్నో చిక్కులు ఎదుర్కొంటూ వచ్చింది.    

ఇక ఈ మధ్యనే సమంత మాజీ భర్త నాగచైతన్యకు వివాహం జరిగిన సంగతి తెలిసిందే. కాగా నాగచైతన్య పెళ్లి వేడుకల రోజే.. సమంత తండ్రి సైతం కాలం చెల్లించారు. ఇలా ఎన్నో బాధలతో ప్రస్తుతం ఈ హీరోయిన్ సతమతమవుతోందని.. ఆమె అభిమానులు సోషల్ మీడియాలో ఎంతగానో బాధపడుతున్నారు.    

ఈ నేపథ్యంలో ఆరు రోజుల క్రితం అనగా.. క్రిస్మస్ రోజున సమంత కొన్ని ఫోటోలు షేర్ చేసింది. తను నిద్రపోతూ.. అలానే తను పువ్వుని పట్టుకొని.. ఆవులను చూస్తూ.. ఇంకా దేవుడి దగ్గర.. ఇలా పలు ఫోటోలు షేర్ చేసి.. పెయిన్ అనేది మన ప్లాన్లో పార్ట్ కాదేమో.. అని మెసేజ్ పెట్టి హ్యాపీ హాలిడేస్ అంటూ రాసుకొచ్చింది.  

ఇక ఇప్పుడు న్యూ ఇయర్ కి తను ఏమి చేస్తున్నానో అన్న విషయం.. తన స్టేటస్ లో షేర్ చేసింది సమంత. ఈ ఫోటోలో చర్చిలో.. క్యాండిల్స్ వెలిగిస్తూ కనిపించింది ఈ హీరోయిన్. మొత్తానికి తన మొదటి సంవత్సరం మొదటి రోజు ఇలా జరుపుకున్నానని.. స్టేటస్ పెట్టింది సమంత.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link