Samantha: ఆకట్టుకుంటున్న సమంత రేర్ ఫొటోస్.. సింపుల్ గా.. ఎంతో అందంగా..
ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. నిజంగానే మాయ చేసేసిన హీరోయిన్ సమంత. తమిళ అమ్మాయి అయినా కానీ.. అచ్చం తెలుగమ్మాయిలా కనిపిస్తూ తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ బృందావనం సినిమాతో మరో విజయం అందుకుంది. ఇక అప్పటినుంచి ఈ హీరోయిన్ కి వరస అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. సీనియర్ హీరోలు.. జూనియర్ హీరోలు అని తేడా లేకుండా దాదాపు అందరితోనూ నటించింది సమంత.
కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే అక్కినేని వారసుడు నాగచైతన్యని పెళ్లి చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. వీరిద్దరూ కలిసి నటించిన ఏమాయ చేసావే.. మనం.. మజిలీ.. లాంటి సినిమాలు మంచి విజయం సాధించాయి.
వీరిద్దరి సినిమాలు విజయాలు సాధించిన వీరి పెళ్లి మాత్రం అపజయంగా మిగిలింది. నాలుగు సంవత్సరాల తరువాత వీరి వివాహిత జీవితంలో కొన్ని విభేదాలు రావడం వల్ల.. విడాకులు తీసుకున్నారు. ఇక ఆ తర్వాత కొద్ది రోజులకి సమంతకి ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి.
ఈ క్రమంలో ఈ మధ్యనే కోలుకున్న సమంత మళ్ళీ సినిమాలతో బిజీ అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సమంత షేర్ చేసిన తన రేర్ ఫొటోస్..తెగ వైరల్ అవుతూ ఆమె అభిమానులను.. విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.