Samantha: సమంత గురించి రూమర్ద్ బాయ్ ఫ్రెండ్ సంచలన వ్యాఖ్యలు.. ఆమె బాధ చూడలేకపోయా.. అందుకే..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు క్యూట్ జోడిగా గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత విడిపోయి అందర్నీ ఆశ్చర్యపరిచారు సమంత - నాగచైతన్య.
నిజానికి వీరిద్దరూ విడిపోయినా.. వీరిద్దరూ మళ్ళీ కలవాలని కోరుకునే అభిమానులు కూడా చాలామంది ఉన్నారు.సమంత - నాగచైతన్య నుంచి విడిపోయిన తరువాత ఎంతో మానసిక వేదన అనుభవించింది అంటూ తాజాగా సామ్ రూమర్ద్ బాయ్ ఫ్రెండ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజ్ మాట్లాడుతూ.. సెట్ లో సమంత ఎంతో కష్టపడింది. షూటింగ్ సమయంలోనే ఆమెకు మయోసైటిస్ కూడా ఉందని తెలిసింది. అటు ఆరోగ్యపరంగా ఇటు మానసిక పరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. సెట్ కి కూడా చాలా లేట్ గా వచ్చేది. నీరసంగా ఉండేది.
ఒక్కొక్కసారి స్పృహ తప్పి పడిపోయేది కూడా. ఆమె అలా పడిపోయిందో లేదో ఇంకేమైందో తెలియక మేము ఎన్నోసార్లు భయపడ్డాము.
ఎన్నోసార్లు అంత సెట్ చేసుకొని ఆమె కోసం ఎదురుచూసే వాళ్ళము. ఆమె కష్టం చూసి మాకే చాలా బాధ వేసింది. ఈ సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం సమంత ఎంతో కష్టపడింది అంటూ చెప్పుకొచ్చారు సమంత రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ రాజ్. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.