Samantha: అదే నా జీవితానికి అసలైన గేమ్ ఛేంజర్.. సమంత..!

గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడి, మెల్లిగా కోలుకుంది. ముందుగా ఒప్పుకున్న ప్రాజెక్ట్లను ఇటీవల పూర్తి చేసింది. ఇక ఇప్పుడు ఎక్కువగా సినిమాలు చేయడానికి ఇష్టపడడం లేదు అనిపిస్తుంది.

మునుపటిలా యాక్టివ్ గా ఉండలేకపోతున్నట్టు అనిపిస్తోంది. అందుకే చేతినిండా ప్రాజెక్టులను పెట్టుకునే బదులు మెల్లిగా ఒక్కొక్కటి చేసేద్దామని అనుకుంటుందట ఈ ముద్దుగుమ్మ
అందులో భాగంగానే రెండేళ్ల నుంచి ఒక మంచి అలవాటును ప్రాక్టీస్ చేస్తోందట. వెల్నెస్ డైరీలో తాను రోజు ఎవరికి? ఎందుకు గ్రేట్ ఫుల్ గా ఉందో..ఎవరికి థాంక్స్ చెప్పాలో? ఎందుకు థాంక్స్ చెప్పాలో? కూడా రాస్తూ వస్తోందట.
అంతేకాదు అందరినీ ప్రాక్టీస్ చేయమని కూడా సలహా ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రారంభంలో కష్టం అనిపించినా అలవాటవుతుందని తెలిపింది..
ముఖ్యంగా ఏం రాయాలో? ఎలా రాయాలో? మనకు అర్థం కాదు. ఆ తర్వాత మెల్లమెల్లగా అదొక అలవాటుగా మారిపోతుంది. మనలో చాలా మార్పులు వస్తాయి. మీరు కూడా అలవాటు చేసుకోండి అంటూ తెలిపింది సమంత. అంతేకాదు ఇది ఇప్పుడు తనకు ఒక గేమ్ చేంజర్ గా మారిందని కూడా సమంత తెలిపింది.