Honour to Samantha: పెరుగుతున్న సమంత క్రేజ్, స్పీకర్‌గా సమంతకు ఆహ్వానం
గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమం నవంబర్ 20 నుంచి 28 వరకూ 9 రోజులపాటు జరగనుంది.
ఈ కార్యక్రమంలో స్పీకర్‌గా సమంతతో పాటు బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్‌కు కూడా ఆహ్వానం అందింది. అటు ప్రముఖ దర్శకుడు అరుణా రాజే, నటుడు జాన్ ఎడతత్తిల్, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిలను కూడా ఆహ్వానించారు.
గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు స్పీకర్‌గా సమంతకు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమంలో మాట్లాడేందుకు ఐఎఫ్ఎఫ్ఐ నిర్వాహకులు సమంతను ఎంపిక చేశారు. ఈ ఆహ్వానం అందుకున్న దక్షిణాది తొలినటిగా సమంత గుర్తింపు పొందడం విశేషం.
విడాకుల తరువాత సమంత..తన రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసింది. పలు ఈవెంట్స్‌కు అతిధిగా హాజరవుతోంది. విడాకుల వేదన నుంచి బయటపడేందుకు షెడ్యూల్ బిజీగా ఉంచుకుంటోంది.
టాలీవుడ్ టాప్ నటి నాగచైతన్య మాజీ భార్య సమంత క్రేజ్ పెరుగుతోంది. నాగచైతన్యతో విడాకుల అనంతరం ఆమెకు గౌరవం పెరుగుతోంది. అటు ప్రాజెక్టుల పరంగా స్పీడ్ పెంచేసింది ఈ క్యూటీ గర్ల్ సమంత.