Samsung Galaxy A55 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఎగబడి కొంటున్న జనాలు!

Tue, 28 May 2024-6:15 pm,

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ సాంసంగ్‌కి సంబంధించిన కొన్ని మొబైల్స్‌ అతి తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. ఫ్లిఫ్‌కార్ట్‌లో స్పెషల్ డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి సాంసంగ్‌ గెలాక్సీ A, F సిరీస్‌లకు సంబంధించి మొబైల్స్‌ అతి తక్కువ ధరల్లో లభిస్తున్నాయి.

ఈ సాంసంగ్‌ మొబైల్స్‌ను బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందవచ్చు. అలాగే EMI ఆప్షన్‌లో కొనుగోలు చేస్తే ఆకర్శనీయమైన డిస్కౌంట్‌ కూడా లభిస్తుంది. దీంతో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.   

ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే డెడ్ చీప్‌ ధరలో లభిస్తుంది. ప్రస్తుతం 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ కలిగిన మొబైల్‌  ధర రూ. 42,999తో ప్రత్యేక డిస్కౌంట్‌లో లభిస్తోంది.

ఈ  Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేయాలనుకునేవారు HDFC బ్యాంక్ కార్డ్‌తో బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ. 3,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ మొబైల్‌ను రూ.38,500కే పొందవచ్చు.   

ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే ఇది 6.6 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేతో లభిస్తోంది. అంతేకాకుండా అద్భుతమైన Exynos 1480 చిప్‌సెట్‌పై పని చేస్తుంది. అలాగే ఇది అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది.   

ఇక ఈ మొబైల్‌ బ్యాక్‌ సెటప్‌ వివరాల్లోకి వెళితే, ఇది ట్రిపుల్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇందులో  50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంటుంది. అలాగే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెపట్‌లో లభిస్తోంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link