Samsung Galaxy Watch 4 Lte Price: అమెజాన్‌లో సాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 LTE వాచ్‌పై 67 శాతం తగ్గింపు.. కేవలం రూ.9,499కే!
ఈ స్మార్ట్ వాచ్‌లను ప్రత్యేకమైన ఫీచర్లతో అద్భుతమైన బిల్ట్ క్వాలిటీతో అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ వాచ్లు బడ్జెట్ సెగ్మెంట్ తో పాటు హై బడ్జెట్ సెగ్మెంట్లలో లభిస్తున్నాయి.
గతంలో సాంసంగ్ మార్కెట్లోకి విడుదల చేసిన గెలాక్సీ వాచ్ 4 LTEకి మార్కెట్లో ఎంత గుర్తింపు లభించిందో అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇది అద్భుతమైన డిజైన్తో ప్రీమియం ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది.
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ ఈ స్మార్ట్ వాచ్ పై ప్రత్యేకమైన ఆఫర్స్ అందిస్తోంది. ఈ ఆఫర్లలో భాగంగా కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరకే ఈ వాచ్ ను పొందవచ్చు.
ప్రస్తుతం మార్కెట్లో ఈ స్మార్ట్ వాచ్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులోని మొదటి బేసిక్ వేరియంట్ రూ.31,999 లకు అందుబాటులో ఉంది.
అమెజాన్ అందిస్తున్న ప్రత్యేకమైన ఆఫర్స్ లో భాగంగా ఈ సాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 LTE స్మార్ట్ వాచ్ ను కొనుగోలు చేస్తే 67% తగ్గింపుతో లభిస్తుంది.
అమెజాన్ అందిస్తున్న ఈ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ స్మార్ట్ వాచ్ రూ. 10,499కే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ మొబైల్ పై ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
బ్యాంక్ ఆఫర్స్ లో భాగంగా ఈ స్మార్ట్ వాచ్ ను హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఆఫర్స్ అన్నీ పోను రూ. 9,499కే పొందవచ్చు.