Samsung Galaxy S24 Features: శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24లో ఉండే టాప్ 5 ఏఐ ఫీచర్లు
నోట్ అసిస్ట్
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 సిరీస్‌లో ఉండే నోట్ అసిస్ట్ ఫీచర్ సహాయంతో మీరు తీసుకునో నోట్స్ సారాంశం తయారు చేసుకోవచ్చు. టెంప్లెట్ చేయవచ్చు. కవర్ డిజైన్ చేసుకోవచ్చు.
లైవ్ ట్రాన్స్‌లేట్
ఈ ఫీచర్ ఫోన్ కాల్ కోసం. లైవ్ ట్రాన్స్‌లేట్ ఫీచర్‌లో ఫోన్ కాల్‌లో ఉన్నప్పుడే మీ మాటల్ని మరో భాషలో అనువాదం చేస్తుంది. దీంతో ఎవరితోనైనా సులభంగా మాట్లాడవచ్చు.
చాట్ అసిస్ట్
ఈ ఫీచర్ కీబోర్డ్‌లో ఉంటుంది. చాట్ మెరుగుపడేందుకు దోహదం చేస్తుంది. చాట్ అసిస్ట్ ఫీచర్ సహాయంతో టైపింగ్ చేసేటప్పుడు మంచి మంచి పదాల సూచనలు అందుకోవచ్చు. ఈ ఫీచర్ సహాయంతో 13 భాషల్లో రియల్ టైమ్ అనువాదం ప్రయోజనం పొందవచ్చు.
సర్కిల్ టు సెర్చ్
శాంసంగ్ ఎస్ 24 సిరీస్‌లో సర్కిల్ టు సెర్చ్ అనే అద్భుతమైన ఫీచర్ ఉంది. ఈ ఫీచర్ ఇప్పటివరకూ ఉన్న సెర్చ్ పద్దతుల్లో అత్యంత అద్భు. ఈ ఫీచర్‌లో ఎస్ పెన్ సహాయంతో ఏదైనా వస్తువుపై సర్కిల్ చేసి దాని గురించి సెర్చ్ చేయవచ్చు.
జనరేటివ్ ఎడిట్
ఇది ఫోటోలు ఎడిట్ చేసే కొత్త పద్ధతి. జనరేటివ్ ఎడిట్ ఫీచర్ సహాయంతో మీరు తీసిన ఫోటోల్ని ఎడిట్ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా చెరపవచ్చు. మార్చుకోవచ్చు. మరింత సుందరంగా మార్చుకోవచ్చు.