Samyuktha Menon: తండ్రి మీద కోపం.. అందుకే మీనన్ పేరు తీసేసిన సంయుక్త..!
సంయుక్త మీనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు.. అవసరం లేదు. మలయాళీ సినిమాలతో.. సినీ రంగ ప్రవేశం చేసిన ఈ హీరోయిన్.. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్.. చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ఈ సినిమాలో రానాకి జోడిగా నటించింది ఈ ముద్దుగుమ్మ.
ఆ తరువాత సంయుక్త మీనన్ నటించిన బింబిసారా..సినిమా కూడా మంచి విజయం సాధించింది. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయం అందుకొని.. సంయుక్తకు వరుసగా రెండు విద్యను ఇచ్చింది. ఇక ఆ తరువాత ధనుష్ తో ..చేసిన సార్ సినిమా .. ఈ హీరోయిన్ కి హ్యాట్రిక్ విజయాలను అందించింది.
అయితే సంయుక్తాకి నటన.స పరంగా వందకి వంద మార్కులు వేయచ్చిన చిత్రం విరూపాక్ష. ఈ సినిమాలో హీరో పాత్ర కన్నా తన పాత్ర హైలెట్గా నిలవడమే కాకుండా.. సినిమా కూడా కమర్షియల్ గా మంచి విజయం అందుకుంది.
అయితే ఈ సంవత్సరం మాత్రం సంయుక్త జోరు పెద్దగా కనిపించలేదు. నిఖిల్ తో పాన్ ఇండియా సినిమా 'స్వయంభూ'లో నటిస్తోంది. మరో పక్క త్వరలోనే బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ క్రమంలో తాజాగా సంయుక్త తన పర్సనల్ లైఫ్ గురించి చేసిన వ్యాఖ్యలు కొన్ని వైరల్ అవుతున్నాయి.
‘అమ్మ, నాన్న విడిపోయారు. నాకు అమ్మంటే చాలా ఇష్టం అలానే గౌరవం. అందుకే ఆమె నిర్ణయాలను గౌరవించి.. నా పేరులో సర్ నేమ్ తీసేసాను. నేను ఆడ, మగ సమానం అనే నమ్ముతాను. నా జీవితంలో ఇలాంటి సందర్బం వచ్చింది కాబట్టి.. అబ్బాయిలు అందరూ అలానే ఉంటారని కూడా నేను అనుకోను. నా కుటుంబంలో జరిగిన సంఘటన నా వరకే పరిమితం,’ అంటూ చెప్పుకొచ్చింది.