Kicha Sudeep: కిచ్చా సుదీప్ ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా..?

Thu, 21 Nov 2024-2:49 pm,
Kicha sudeep personal life

ప్రముఖ కన్నడ హీరో కిచ్చా సుదీప్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన నటనతో భారీ పాపులారిటీ అందుకున్న ఈయన, తెలుగులో కూడా రాజమౌళి దర్శకత్వంలో నాని, సమంత కాంబినేషన్లో వచ్చిన ఈగ సినిమాతో విలన్ గా తెలుగు తెరకు పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే విలన్ గా అందరిని అబ్బురపరిచారు.

Kicha sudeep remuneration

ఇకపోతే తాజాగా కన్నడలో బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సీజన్ వన్ నుంచి ప్రస్తుతం సీజన్ 11 నడుస్తోంది. ఇప్పటివరకు కూడా ఆయనే హోస్ట్ గా వ్యవహరిస్తూ తన అద్భుతమైన హోస్టింగ్ తో అందరిని ఆకట్టుకున్నారు. ఇకపోతే ఇదే తన చివరి హోస్టింగ్ అంటూ కూడా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.   

Kicha Sudeep net worth

ఇదిలా ఉండగా తాజాగా కిచ్చా సుదీప్ కి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆయన ఆస్తి విలువ ఎంత అంటూ నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే సాధారణంగా ఒక హీరో వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే కిచ్చా సుదీప్ ఆస్తులు వివరాలు తెలుసుకోవడానికి కూడా అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.   

కిచ్చా సుదీప్ నటుడుగానే కాకుండా దర్శకుడిగా, గాయకుడిగా, నిర్మాతగా, సమర్పకుడుగా, అద్భుతమైన క్రికెటర్ గా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు.. ఇక టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం నికర ఆస్తి విలువ రూ.125 కోట్లు.. నటన,  రియాల్టీ షోలకు హోస్ట్ గా పని చేయడం, దర్శకత్వం  నిర్మాణ సంస్థ ద్వారా భారీగా సంపాదించారు. ఇక ఈయనకు కార్లంటే చాలా ఇష్టం.  ఈ నేపథ్యంలోనే రేంజ్ రోవర్ వోగ్యా, జీప్ రాంగ్లర్, జాగ్వార్, హమ్మర్ హెచ్ 3, లంబోర్గిని అవెంటా దార్, వోల్వో వంటి కార్లు ఆయన గ్యారేజ్ లో ఉన్నాయి.   

ఇకపోతే జేపి నగర్ లో రూ.20 కోట్ల విలువైన ఒక ఇంటిని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.25 కోట్లు పారితోషకం తీసుకుంటున్నారు. పలు యాడ్స్ కి కూడా పనిచేస్తూ భారీగానే సంపాదిస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link